Dilsukhnagar Bomb Blast | దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు ఊహించని తీర్పు వెల్లడించింది. పేలుళ్లకు పాల్పడిన ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు చేసింది. NIA ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. అక్తర్, జియా ఉర్ రహమాన్, తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, అజాజ్ షేక్‌కు ఉరిశిక్ష విధించింది.
Also Read: పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు
ఏం జరిగిందంటే?
2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ బ్లాస్ట్‌లో 18 మంది మృతి చెందారు. మరో 130 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసును విచారించిన ఎన్‌ఐఏ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 2016లో మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి మరణశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది.
Also Read: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!
అయితే, కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఈ శిక్షను సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. నిందితుల పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. నేడు తుది తీర్పు ఇచ్చింది. NIA ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్థిస్తూ వారికి ఉరిశిక్ష ఖరారు చేసింది.
Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!
157 మంది సాక్ష్యులు..
21న ఫిబ్రవరి 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లు సంభవించాయి. ఎన్‌ఐఏ రంగంలోకి దిగి విచారణ జరిపింది. విచారణలో 157 మంది సాక్ష్యాలను రికార్డు చేసింది. ఈ ఘటనలో ఇండియన్ ముజాహిద్ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ప్రధాన నిందితుడిగా తేలింది. ఈ ఘటనలో అసదుల్లా అక్తర్, వకాస్, తెహసీన్ అక్తర్, ఎజాజ్ షేక్, సయ్యద్ మక్బూల్‌ని నిందితులుగా గుర్తించారు.
Also Read: క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!
మూడేళ్లు ఈ కేసులు విచారించిన ఎన్‌ఐఏ స్పెషల్ కోర్టు విచారణ తర్వాత నిందితులకు మరణశిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన యాసిన్ భత్కల్‌ను 2013లో నేపాల్ సరిహద్దుల్లో పట్టుకున్నారు. ఢిల్లీ, దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసు సహా పలు కేసుల్లో దోషిగా తేలగా తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.