IPL 2024: ప్లే ఆఫ్ రేసులో ఢిల్లీ క్యాపిటల్స్..బ్యాటింగ్ లో విరుచుకుపడిన ఢిల్లీ బ్యాటర్స్..

IPL లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో కొన్ని జట్ల స్వరూపాలే మారిపోయాయి. నిన్నజరిగిన మ్యాచ్ లో ఢిల్లీ జట్టు రాజస్థాన్ రాయల్స్‌పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ రెండు స్థానాలు ఎగబాకి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది.

New Update
IPL 2024: ప్లే ఆఫ్ రేసులో ఢిల్లీ క్యాపిటల్స్..బ్యాటింగ్ లో విరుచుకుపడిన ఢిల్లీ బ్యాటర్స్..

Delhi Capitals Alive In The Playoffs Race: ఐపీఎల్ 2024 56వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్‌తో (DC Vs RR) తలపడింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 8 వికెట్లకు 221 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ 201 పరుగుల వద్ద ఆగిపోయింది. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో సంజూ శాంసన్ జట్టు రాజస్థాన్ రాయల్స్ ఆధిక్యం ముగిసింది. అయితే 16 పాయింట్లతో రెండో స్థానంలోనే కొనసాగుతోంది. కానీ RR కి కష్టమైన విషయం ఏమిటంటే అది వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఏప్రిల్ 27న 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. 10 రోజుల తర్వాత కూడా 16 పాయింట్ల వద్ద నిలిచిపోయింది. కోల్ కతా నైట్ రైడర్స్ అదే పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో ఉంది.

Also Read: సిక్‌ లీవ్ పెట్టిన సిబ్బంది..నిలిచిన 70 ఎయిర్‌ ఇండియా విమానాలు!

రాజస్థాన్ రాయల్స్ ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ప్లేఆఫ్‌కు చేరుకోవడంపై సందేహం నెలకొంది. కానీ ఢిల్లీ (Delhi Capitals) ఖచ్చితంగా లక్నో సూపర్‌జెయింట్‌లు, సన్‌రైజర్స్ హైదరాబాద్. చెన్నై సూపర్‌కింగ్స్‌లకు టెన్షన్‌ లో పడేసింది.. ఈ మూడు జట్లకు ఇప్పటికే 12 పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ కూడా 12 పాయింట్లకు చేరుకుంది.  లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు ఆరో స్థానంలో . మూడో స్థానంలో చెన్నై, నాలుగో స్థానంలో హైదరాబాద్ కొనసాగుతున్నాయి.

ఐపీఎల్‌లో చెన్నై ఐదో స్థానానికి దిగజారవచ్చు
, ఏప్రిల్ 8న సన్‌రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్‌జెయింట్‌ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే  నిన్న హైదరాబాద్ లో భారీ వర్ష కురవటంతో మ్యాచ్ పై అనుమానాలు నెలకొన్నాయి. నేడు బుధవారం వర్షం కారణంగా ఈ మ్యాచ్ జరగకుంటే ఇరు జట్లు 1-1తో పాయింట్ల దక్కించుకుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానంలోనూ, లక్నో సూపర్ జెయింట్స్ నాలుగో స్థానంలోనూ రావచ్చు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. పాయింట్ల పట్టికలో ఐదు, ఆరో స్థానాలకు దిగజారిన చెన్నై, ఢిల్లీకి నేరుగా ఓటమి తప్పదు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News Updates: తెలంగాణలో భారీ వర్షం.. ఈదరు గాలులతో హైదరాబాద్‌ అతలాకుతలం

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu

🔴Live News Updates:

TS: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు

తెలంగాణలో నెంబర్ ప్లేట్లు మార్చాల్సిన టైమ్ వచ్చేసింది. పాతదే అయినా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ తప్పనిసరి చేసింది రవాణాశాఖ. సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా నిర్ణయించింది. 

ts
High Security number plate

 

మీ వెహికల్ 2019 ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందు తయారైందా...అయితే అర్జంటుగా వెళ్ళి నంబర్ ప్లేట్ మార్చుకోండి.  పై తేదీ కన్నా ముందు తయారైన వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ బిగించుకోవాల్సిందేనని తెలంగాణ రవాణాశాఖ చెప్పింది.  దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వాహన రకాన్ని బట్టి నంబర్‌ ప్లేట్‌కు కనిష్ఠంగా రూ.320.. గరిష్ఠంగా రూ.800గా ఛార్జీలను ఖరారు చేసింది. నకిలీ నంబర్‌ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం, దొంగతనాలను అరికట్టడం, వాహనాలు రహదారి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేస్తున్నామని రవాణాశాఖ చెబుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. 

కచ్చితంగా మార్చాల్సిందే..

పాత వాహనాలకు నంబర్ ప్లేట్ మార్చాల్సి బాధ్యత యజమానిదే అని తేల్చి చెప్పింది రవాణాశాఖ. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ మార్చుకోకపోతే వాహనాలను అమ్మాలన్నీ, కొనాలన్నా సాధ్యం కాదని తెలిపింది. అలాగే బీమా, పొల్యూషన్ సర్టిఫికేట్ లాంటివి కూడా లభించవు. పైగా సెప్టెంబర్ తర్వాత కొత్త నంబర్ ప్లేట్లు కనిపించకపోతే కేసులు కూడా నమోదు చేయనున్నారు.  ఇక ఈ నంబర్ ప్లేట్లు వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల దగ్గర కూడా చేయించుకోవచ్చును. దీనికి సంబంధించిన సమాచారం, నంబర్ ప్లేట్ ధరలు డీలర్ దగ్గర కనిపిచేలా చేయనున్నారు. వాహనదారులు ఈ ప్లేట్‌ కోసం www.siam.in వెబ్‌సైట్‌లో ..వాహన వివరాలు నమోదు చేసి బుక్‌ చేసుకోవాలి. కొత్త ప్లేట్‌ బిగించాక ఆ ఫొటోను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

Also Read:  Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

  • Apr 10, 2025 16:13 IST

    తెలంగాణలో భారీ వర్షం.. ఈదరు గాలులతో హైదరాబాద్‌ అతలాకుతలం

    హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లిహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, ఫిల్మ్‌నగర్, హైటెక్‌ సిటీ, కొండాపూర్, లింగంపల్లి, మియాపూర్, మదీనా గూడ, చందానగర్‌ తదితర ప్రాంతాల్లో ఉరుముల, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.



  • Apr 10, 2025 14:42 IST

    ఏం మనిషివిరా.. దారుణం.. అక్కనే చంపిన తమ్ముడు

    హైదరాబాద్‌లోని ఓల్డ్‌ మలక్‌పేటలో కుటుంబ తగాదాలతో అక్కను తమ్ముడు చంపాడు. పాత మలక్‌పేటలో నివాసం ఉంటున్న లక్ష్మిని ఆమె సోదరుడు మదన్‌బాబు కత్తితో దాడి చేసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



  • Apr 10, 2025 14:41 IST

    పవన్ కొడుకు కోలుకోవాలని జనసైనికుల పూజలు,

    పిఠాపురంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని పూజలు నిర్వహిస్తున్నారు. పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో జనసైనికులు, వీరమహిళలు మృత్యుంజయ హోమం జరిపించారు. మార్క్ సంపూర్ణ ఆరోగ్య వంతులుగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 

    Special prayers for pawan son mark
    Special prayers for pawan son mark

     



  • Apr 10, 2025 11:28 IST

    Stock Markets: టారీఫ్ లకు బ్రేక్..ఆసియా, వాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్లో జోష్

    సుంకాలకు బ్రేక్ ఇస్తున్నామని అధ్యక్షుడు ట్రంప్ చెప్పడంతో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. ఈరోజు ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికాలో కూడా మార్కెట్లు రికార్డ్ స్థాయిలో లాభపడ్డాయి. మహావీర్ జయంతి కారణంగా భారత స్టాక్ మార్కెట్లకు సెలవు. 

    stock market
    stock market

     



  • Apr 10, 2025 11:27 IST

    ఒలింపిక్స్‌లో క్రికెట్.. దాయాది దేశం పాకిస్థాన్‌కు నో ఛాన్స్

    2028లో లాస్ ఏంజెల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో టీ20 ఫార్మాట్‌లో క్రికెట్ ఆడనున్నాయి. మెన్స్, ఉమెన్స్ విభాగాల్లో 6 జట్లు కూడా ఆడుతాయి. టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా ఆడుతాయి. పాక్‌కు ఛాన్స్ లేదు.

    LOS ANGELES CRICKET
    LOS ANGELES CRICKET Photograph: (LOS ANGELES CRICKET)

     



  • Apr 10, 2025 11:22 IST

    Bandi sanjay : కాంగ్రెస్ అంతరించిపోతున్న జాతి.. రేవంత్కు బండి సంజయ్ కౌంటర్

    సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ ల మధ్య డైలాగ్‌ వార్ నడుస్తోంది. అహ్మదాబాద్‌ వేదికగా ఏఐసీసీ మీటింగ్‌లో రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణలో బీజేపీని కాలు కూడా పెట్టినివ్వనని..  బ్రిటిషర్ల కంటే బీజేపీ చాలా ప్రమాదకరమంటూ సీఎం కామెంట్స్ చేశారు.

    bandi-sanjay counter
    bandi-sanjay counter

     



  • Apr 10, 2025 11:21 IST

    HIV: జైలులోని 15 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ పాజిటివ్

    ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హరిద్వార్ జిల్లా జైలులో ఖైదీలకు పరీక్షలు నిర్వహించారు. 15 మంది ఖైదీలకు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో వెంటనే జైలు అధికారులు వారిని ప్రత్యేక బ్యారక్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

    Uttarkhand Jail in HIV
    Uttarkhand Jail in HIV Photograph: (Uttarkhand Jail in HIV)

     



  • Apr 10, 2025 11:20 IST

    MLC kavitha : పవన్ అనుకోకుండా డిప్యూటీ సీఎం... ఎమ్మెల్సీ కవిత సంచలనం!

    జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని, ప్రజలు హిందీ నేర్చుకోవాలన్న పవన్  వ్యాఖ్యలపై స్పందనేంటని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానమిచ్చారు.

    kavitha-pawan
    kavitha-pawan

     



  • Apr 10, 2025 08:52 IST

    ఎంతకు తెగించావ్ రా.. ప్రేమ పెళ్లి.. ఆరు నెలలకే..!

    జగిత్యాల కోరుట్లలో రజిత అనే వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయ్యప్ప గుట్టపై మహిళ మృతదేహం కనిపించింది. పవన్ అనే వ్యక్తిని 6 నెలల కిందట ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతనే రజితను చంపినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

    Karimnagar Wife And Husband Incident🔴LIVE : ప్రేమపెళ్లి.. 6 నెలలకే కొట్టి చంపి | Jagtial News | RTV



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు