ఖమ్మంలో కసి తీర్చుకున్న కాంగ్రెస్.. ఫిరాయింపు ఎమ్మెల్యేల వెన్నులో వణుకే

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. 10లో తొమ్మిది స్థానాల్లో గెలిచి అధికార పార్టీ బీఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలే టార్గెట్ గా కాంగ్రెస్ కసితీర్చుకుంది. ఫిరాయింపు నేతల ఓటమితో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో నయా జోష్ కనిపిస్తోంది.

New Update
ఖమ్మంలో కసి తీర్చుకున్న కాంగ్రెస్.. ఫిరాయింపు ఎమ్మెల్యేల వెన్నులో వణుకే

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం జిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది. కాంగ్రెస్ కు కంచుకోటగా మారిన ఖమ్మంలో ఊహించినట్లుగానే పార్టీ హవా కొనసాగింది. పదిలో 9 స్థానాల్లో కాంగ్రెస్ కు భారీ ఆధిక్యం లభించిందంటే కాంగ్రెస్ కు ఎంతటి ప్రజాదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు పర్యాయాల్లో జరిగిన ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించడంతోపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టించిందనడంతో సందేహం లేదు.

ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా చెప్పుకొవాల్సిన విషయం ఏమిటంటే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నలుగురు ఫిరాయింపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దారుణంగా ఓటమిపాలయ్యారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచి బీఆర్ఎస్ లో చేరిన కందాళ ఉపేందర్ రెడ్డి, బానోత్ హరిప్రియ, వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావులను ప్రజలను తిరస్కరించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఓడగొట్టాలని గతంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునివ్వగా.. కాంగ్రెస్ కేడర్ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఓటమి కోసం సమిష్టిగా పనిచేశారు. దీంతె ఫిరాయింపు నేతల ఓటమితో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో నయా జోష్ కనిపిస్తోంది. కొన్నేళ్లనుంచి బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత కనిపిస్తుండగా ఈసారి ఓట్లతో కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలు తమ కసీ తీర్చుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం పట్ల తమకున్న అక్రోశాన్ని ఓట్లు రూపంలో చూపించారు. తమను చిన్నచూపు చూస్తూ ఊరుకునేది లేదని, ఎంతటివారికైనా ఇలాగే బుద్ది చెబుతామంటూ సవాల్ విసిరారు. అడ్డగోలుగా హామీలిచ్చి నేరవేర్చని నాయకులు మరోసారి పోటీచేయాలంటే జంకేలా చేశారు.

Also read :Telangana CM: సాయంత్రం 5గంటలకే సీఎంగా రేవంత్ ప్రమాణం?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాగింది. 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ హవా సాగించగా, సీపీఐ తో పొత్తు పెట్టుకున్న కొత్తగూడెం స్థానంలోనూ సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు జయకేతనం ఎగురవేశారు. దీంతో మొత్తం పది స్థానాల్లో 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీని నమోదు చేయడం విశేషం. కాగా ఈ ఘన విజయంపై స్పందించిన పొంగులేటి శ్రీనివాస్.. అన్ని వర్గాల ఆదరాభిమానాలతో ఖమ్మంలో కాంగ్రెస్‌ విజయం ఖాయమైందని, రాష్ట్రాన్నిచ్చిన సోనియా రుణం తీర్చుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఇక గెలిచిన ప్రతి ఒక్కరికీ 20 వేల పైచిలుకు మెజారిటీనే రావడం గమనార్హం. పాలేరులో పోటీ చేసిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 57,231 ఓట్ల మెజారిటీ సాధించి జిల్లాలో అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా రికార్డుకెక్కారు. కేవలం భద్రాచలం నియోజకవర్గం లోని టిఆర్ఎస్ పార్టీ గెలుపొందింది ఆ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రముఖ వైద్యుడు తెల్ల వెంకటరావు 6,319 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్ధి పొడెం వీరయ్యపై గెలిచారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు