Deepika Padukone: బీచ్‌ లో సరదాగా గడుపుతున్న దీపికా.. ఫొటోలు వైరల్‌!

బాలీవుడ్‌లో నటీమణి దీపికా పదుకొణె కొద్ది రోజుల క్రితం దీపికా తల్లిని కాబోతున్నాను అంటూ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంది.తాజాగా దీపికా తాను బీచ్‌ లో ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. వాటిని చూసిన అభిమానులు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

New Update
Deepika Padukone: బీచ్‌ లో సరదాగా గడుపుతున్న దీపికా.. ఫొటోలు వైరల్‌!

BollyWood: బాలీవుడ్‌లో నటీమణి దీపికా పదుకొణె (Deepika Padukone) తన అందంతో పాటు నటనతో అభిమానుల మనసు దోచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. కొద్ది రోజుల క్రితం దీపికా తల్లిని కాబోతున్నాను అంటూ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంది. ప్రస్తుతం ఈ బేబీ.. తన బేబీ మూన్‌ ని ఎంజాయ్‌ చేస్తుంది. తాజాగా దీపికా తాను బీచ్‌ లో ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఆ ఫొటోకి ఆమె భర్త రణవీర్‌ సింగ్‌ నన్ను వెనకటి కాలానికి తీసుకుని వెళ్లండి అంటూ కామెంట్ పెట్టాడు.

దీపికా పోస్ట్‌ చేసిన ఫొటోల్లో తన వీపు భాగాన్ని మాత్రమే చూపించింది. ఆ చిత్రంలో ఆమె వీపు భాగం కొంత వరకు ట్యాన్‌ అయ్యి కనిపిస్తుంది. ఆమె బీచ్‌ వైపునకు తిరిగి సముద్ర తీరంలో సూర్యుని చూస్తూ ఉంది. ఈ ఫొటోను చూసిన అభిమానులు ఆమెకు వింత వింత కామెంట్లు పెడుతున్నారు. కొందరు సూపర్‌ ఉందని కామెంట్లు పెడుతుంటే మరికొందరు మాత్రం టానింగ్‌ నుంచి విముక్తి కోసం చిట్కాలు పెడుతున్నారు.

దీపికా పదుకొణె ఫోటోపై స్పందిస్తూ, ఒక నెటిజన్ ఇలా వ్రాశారు, 'ఇప్పుడు ఒక్క విమానాశ్రయం ఫోటో కూడా కనిపించలేదు, ఆమె ఎప్పుడు సెలవులకు వెళ్లింది?' అంటూ సందేహాన్ని వ్యక్తం చేశాడు. మరొక వ్యక్తి 'సూర్యకాంతితో నిండిన ప్రపంచంలో నివసించే గోధుమ రంగు అమ్మాయి' అని రాశారు. మరో వ్యక్తి 'నేను ఆమె బేబీ బంప్ ఫోటోల కోసం ఎదురు చూస్తున్నాను. మరొకరు ఇలా రాశారు, 'సూర్యుని కంటే వేడిగా ఉన్న వ్యక్తికి టాన్ ఎలా వస్తుంది?' ఒక వ్యక్తి టాన్ తొలగించడానికి చిట్కాలు కూడా ఇచ్చాడు, 'టాన్ ట్రీట్‌మెంట్ - శెనగపిండి + పెరుగు + అలోవెరా జెల్ + పప్పు వేయండి.'

దీపికా పదుకొణె గత ఏడాది రెండు సూపర్‌హిట్ చిత్రాలలో కనిపించింది. ఇందులో షారుఖ్ ఖాన్ 'జవాన్', 'పఠాన్' చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఈ నటి తన ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తూ బిజీగా ఉంది.

Also read; మార్నింగ్‌ వాక్‌ నుంచి తిరిగి వచ్చిన తరువాత ముందుగా ఏం తినాలి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment