'ఫైటర్'లో రెచ్చిపోయిన దీపిక.. బీచ్ లో అరాచకమే చేసిందిగా!

అప్ కమింగ్ మూవీ 'ఫైటర్'లో తనను మునుపెన్నడూ చూడని కొత్త కోణాల్లో చూస్తారంటోంది దీపికా పదుకొణే. హృతిక్‌రోషన్‌ హీరోగా సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించిన ఈ సినిమా 2024 జనవరి 25న రిలీజ్ కానుండగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నటి అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేస్తోంది.

New Update
'ఫైటర్'లో రెచ్చిపోయిన దీపిక.. బీచ్ లో అరాచకమే చేసిందిగా!

బాలీవుడ్‌ భామ దీపికా పదుకొణే తన అప్ కమింగ్ మూవీ 'ఫైటర్'పై అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేస్తోంది. హృతిక్‌రోషన్‌ హీరోగా సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించిన ఈ సినిమా 2024 జనవరి 25న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న దీపిక తనలో మునుపెన్నడూ చూడని కొత్త కోణాలను ఇందులో చూస్తారంటోంది. అంతేకాదు ఈ సినిమాకోసం చాలా రిస్క్ చేశానని, ఒక దశలో ప్రాణాలు పోతాయని భయపడిన సందర్భాలున్నాయంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

publive-image

'దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ 'ఫైటర్'మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. ఆయన ఆలోచనా విధానం అమెజింగ్. అయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అభిమానులు నాలో ఎప్పుడూ చూడని కోణాలు ఇందులో చూస్తారు. ఇది ఓ వీరోచిత ప్రేమగాధ. ఈ మూవీలో చాలా సాహసాలు చేశాను. ఎయిర్‌బేస్‌లో రియల్ సుఖోయ్‌, భారతీయ యుద్ధ విమానాలతో సీన్స్ తెరకెక్కించారు. అప్పుడు కొన్ని స్టంట్స్ చేస్తుండగా ప్రాణాలమీదకు తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. టీమ్‌ చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు' అని చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి : తొమ్మిదొవ తరగతిలోనే అతనితో ప్రేమలో పడ్డాను.. ఇంకా మరిచిపోలేకపోతున్నా: తాప్సీ

అలాగే ఇటీవల మూవీనుంచి విడుదలైన ఫ‌స్ట్ సింగిల్‌ కు భారీ రెస్పాన్స్ వస్తుండగా 'ఇష్క్ జైసా కుచ్' అనే రొమాంటిక్ సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ మొత్తం బీచ్ లో షూటింగ్ నిర్వహించగా.. ఇద్దరిమధ్య బోల్డ్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే దీనిపై కూడా మాట్లాడి దీపిక.. హృతిక్ తో రొమాన్స్ సాంగ్ మంచి అనుభూతిని ఇచ్చిందని, ఒక్కమాటలో చెప్పాలంటే సినిమా చూస్తున్నప్పుడు హాలీవుడ్‌ సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుందని తెలిపింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ ను ఊపేస్తుండగా హృతిక్, దీపికల రొమాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలపై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే గ్రాండ్‌గా నిర్మించిన సినిమాలో అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ali-Venkatesh : హీరోలుగా ఒకే సినిమా...ఆలీకి సూపర్ హిట్.. వెంకటేష్కు అట్టర్ ప్లాప్!

వేరే బాషల్లోని  సినిమాలను తెలుగులో రీమేక్ చేసే వెంకటేష్..  ఓ తెలుగు సినిమాను హిందీలో రీమేక్‌ చేశాడని చాలామందికి తెలియదు. అది కూడా కమేడియన్ ఆలీ సినిమా యమలీల. అయితే ఈ సినిమా అక్కడ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ కాగా టీవీల్లో కల్ట్ హిట్‌గా నిలిచింది.

New Update
ali-venkatesh

ali-venkatesh

హీరో వెంకటేష్ అంటే టక్కున గుర్తొచ్చేది రీమేక్.. వెంకీ కెరీర్ మొత్తం చూసుకుంటే డైరెక్ట్ కంటే రీమేకులే ఎక్కువగా ఉంటాయి. ఆ రీమేక్ లలోనే వెంకీకి చాలా హిట్స్ ఉన్నాయి. అయితే వేరే బాషల్లోని  సినిమాలను తెలుగులో రీమేక్ చేసే వెంకటేష్..  ఓ తెలుగు సినిమాను హిందీలో రీమేక్‌ చేశాడని చాలామందికి తెలియదు. అది కూడా కమేడియన్ ఆలీ సినిమా. 

Also read :  Uttar Pradesh : ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!

వెంకటేష్ తక్దీర్వాలా పేరుతో

ఆలీ హీరోగా ఎస్వీ కృష్ణ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా యమలీల. ఇందులో ఆలీ, ఇంద్రజ, మంజు భార్గవి ప్రధాన పాత్రల్లో నటించారు. కైకల సత్యనారయణ యుముడి పాత్రలో నటించారు.  రూ. 75 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రెట్టింపు వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసిన ఆలీ రూ.50,000 పారితోషికం అందుకున్నాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో హీరోగా ఏకంగా 50 సినిమాలు చేశాడు ఆలీ. 

అయితే  తెలుగులో ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో హీరో వెంకటేష్ తక్దీర్వాలా పేరుతో హిందీలో రీమేక్ చేశారు. ఈ చిత్రానికి కె. మురళీ మోహన రావు దర్శకత్వం వహించగా..  సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై  రామా నాయుడు నిర్మించారు. ఇందులో వెంకటేష్  సరసన రవీనా టాండన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ టెలివిజన్‌లో ప్రసారం అయిన తర్వాత కల్ట్ హిట్‌గా నిలిచింది. రూ. 2.75 కోట్లుతో ఈ సినిమాను నిర్మించారు.  

Also Read : Tamilisai Soundararajan : తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!

Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

Advertisment
Advertisment
Advertisment