Special Trains: దీపావళికి ప్రత్యేక రైళ్లు..అనౌన్స్ చేసిన రైల్వే శాఖ! దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు మరోసారి సౌత్ ఈస్టర్న్ రైల్వే రెడీ అయ్యింది. దీని గురించి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. By Bhavana 04 Nov 2023 in విజయవాడ నేషనల్ New Update షేర్ చేయండి పండుగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిని పెట్టుకుని ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను, ప్రత్యేక బస్సులను నడిపే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు మరోసారి సౌత్ ఈస్టర్న్ రైల్వే రెడీ అయ్యింది. దీని గురించి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 13, 20, 27 తేదీల్లో చెన్నై సెంట్రల్ నుంచి భువనేశ్వర్ కి ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. రాత్రి 11.45 గంటలకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలు బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. ఇక ఈ నెల 14, 21, 28 తేదీల్లో భువనేశ్వర్ నుంచి చెన్నై సెంట్రల్ ప్రత్యేక రైలు రాత్రి 9 గంటలకు భువనేశ్వర్ లో మొదలై మరుసటి రోజు మధ్యాహ్ననికి చెన్నై చేరుకుంటుంది. ఈ ట్రైన్స్..గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్ధా రోడ్డు స్టేషన్లలో ఆగుతాయని రైల్వే శాఖ తెలిపింది. సౌత్ ఈస్టర్న్ రైల్వే..ఇక చెన్నై సెంట్రల్ -సంత్రాగచ్చి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఈ నెల 11, 18, 25 తేదీల్లో చెన్నై సెంట్రల్ నుంచి సంత్రాగచ్చి ప్రత్యేక సూపర్ ఫాస్ట్ రైలును నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. చెన్నై సెంట్రల్ నుంచి రాత్రి 11.45 కి బయల్దేరి మూడో రోజు తెల్లవారు జామున 3.45 గంటలకు సంత్రాగచ్చి చేరుకోనుంది. 13, 20, 27 తేదీల్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.. సంత్రాగచ్చిలో ఉదయం 5 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 11 గంటలకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ చేరుకోనుంది.. గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్దా రోడ్డు, భువనేశ్వర్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్ స్టేషన్లలో ఆగుతాయని రైల్వేశాఖ వివరించింది. విజయవాడ రైల్వే డివిజన్ లో మరమ్మతుల కారణంగా బిట్రగుంట- చెన్నై - బిట్రగుంట ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ ఈస్టర్న్ రైల్వే ప్రకటించింది. గతంలో ఈ నెల 5వ తేదీ వరకు ఆ రైలును రద్దు చేస్తున్నట్టు ప్రకటించినా.. తాజాగా 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. అలాగే, కాట్పాడి-తిరుపతి-కాట్పాడి ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 12వ తేదీ, అరక్కోణం-కడప-అరక్కోణం మెము రైళ్లను ఈ నెల 12వ తేదీ వరకు రద్దు చేసినట్లు తన ప్రకటనలో పేర్కొంది సౌత్ ఈస్టర్న్ రైల్వే. Also read: నా కోరిక ఎప్పుడు తీరుతుందో అంటున్న త్రిష! #railway #diwali మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి