Mukesh Ambani: ముఖేశ్ అంబానీకి ప్రాణహాని? రూ.20కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరింపులు! రూ.20 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అంబానీకి సెక్యూరిటీ మరింత టైట్ చేశారు పోలీసులు. గతంలోనూ అంబానీకి పలుమార్లు బెదిరింపు లేఖలు వచ్చాయి. అంబానీ నివాసం యాంటిలియాకు సమీపంలోని ఓ కారులో పేలుడు పదార్థాలు దొరకడం అప్పట్లో సంచలనం రేపింది. By Trinath 28 Oct 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Mukesh Ambani receives death threat: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ (Mukesh Ambani)కి మరోసారి బెదిరింపులు వచ్చాయి. చంపేస్తామంటూ ఈ-మెయిల్ వచ్చింది. 20 కోట్లు ఇవ్వాలంటూ ఓ వ్యక్తి బ్లాక్‌మెయిల్ చేశాడు. అంబానీకి ఇలా బెదిరింపులు రావడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ అనేకసార్లు వచ్చాయి. దీంతో అంబానీకి సెక్యూరిటీ పెంచారు పోలీసులు. అక్టోబర్ 27(నిన్న)న షాదాబ్ ఖాన్ అనే పేరుతో ఈ-మెయిల్ వచ్చింది. ఈ విషయాన్నిముఖేశ్ అంబానీ భద్రతా సిబ్బంది పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. సదరు వ్యక్తిపై ఐపీసీ 387, 506(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీ అడ్రెస్ ట్రాక్ చేసే పనిలో ఉన్నారు. అంబానీ నివాసం యాంటిలియా (File) షూటర్లు ఉన్నారు: 'భారత్‌లో అత్యుత్తమ షూటర్లు ఉన్నారు' అని ఈ-మెయిల్‌లో రాసి ఉందని సమాచారం. అంబానీకి గతంలో కూడా పలుమార్లు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. అంబానీతో పాటు ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తామని గతంలో బ్లాక్ మెయిల్స్ చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేయగా.. అది బీహార్ వాసి పనిగా తేలింది. రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిని బాంబుతో పేల్చేస్తానని బెదిరించిన అతడిని గతేడాది పోలీసులు అరెస్ట్ చేశారు. అటు అంబానీ బంగ్లాను బాంబులతో పేల్చివేస్తామని నాగ్‌పూర్ పోలీసులను కూడా దుండగులు బెదిరించారు. 2021లోనూ అంతే: ఇక 2021లో అంబానీ నివాసానికి(యాంటిలియాకు) సమీపంలో ఓ కారులో పేలుడు పదార్థాలు దొరికాయి. జెలిటిన్ స్టిక్స్, బెదిరింపు లేఖతో ఉన్న స్కార్పియో కారులో ఇవి లభ్యమయ్యాయి. లేఖలో 'యే సిర్ఫ్ ట్రైలర్ హై' అని రాసి ఉంది. అంటే 'ఇది ట్రైలర్ మాత్రమే' అని అర్థం. ఈ కేసులో ముంబై పోలీసు అధికారి అరెస్టు కావడంలో అప్పట్లో సంచలనం రేపింది. ఇలా ఇప్పటికే అనేకసార్లు హత్యా బెదిరింపులను ఎదుర్కొన్నారు అంబానీ. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు అంబానీకి సెక్యూరిటీ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు దేశం అంతటా.. విదేశాలకు వెళ్లినప్పుడు అత్యున్నత స్థాయి జడ్ ప్లస్ భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు హోం మంత్రిత్వ శాఖను ఆదేశించింది. అత్యున్నత స్థాయి భద్రత కల్పించడానికి అయ్యే మొత్తం ఖర్చును అంబానీ కుటుంబమే భరిస్తుందని చెప్పింది. జడ్ ప్లస్ భద్రత కింద ముఖేశ్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు 10+ ఎన్ఎస్జీ కమాండోలు, పోలీసు సిబ్బంది సహా 55 మంది రక్షణ కల్పిస్తారు. Also Read: Asian Para Games: ఆసియా పారా గేమ్స్ లో ఆర్చర్ శీతల్ అద్భుత ప్రదర్శన.. గోల్డ్ మెడల్ కైవసం - Rtvlive.com #mukesh-ambani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి