DC vs KKR : కొడితే బాల్ బీచ్ లో పడింది.. విశాఖలో కేకేఆర్ సిక్సర్ల సునామీ..!

సిక్సర్ల వర్షంతో విశాఖ స్టేడియం తడిసి ముద్దయ్యింది. కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు సుడిగాలి ఇన్నింగ్స్ తో చెలరేగి ఆడారు. ఓపెనర్ సునీన్ నరైన్ అర్థ సెంచరీతో చెలరేగాడు. అంగ్ క్రిష్ రాఘువంశీ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

New Update
DC vs KKR : కొడితే బాల్ బీచ్ లో పడింది.. విశాఖలో కేకేఆర్ సిక్సర్ల సునామీ..!

Visakha Beach :  ఐపీఎల్ 2024(IPL 2024) 16వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) మధ్య జరిగింది. వైజాగ్ స్టేడియంలో సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించింది కేకేఆర్. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ బ్యాట‌ర్లు సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెల‌రేగి ఆడారు. దొరికిన బంతిని దొరిక‌న‌ట్టు చితక్కొట్టారు. రెండు గంట‌ల పాటు ఢిల్లీ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కొసారు. దాంతో, వైజాగ్‌లో అత్య‌ధిక సిక్స‌ర్ల(15) రికార్డు బీచ్ లో కొట్టుకుపోయింది. హ్యాట్రిక్ విజ‌యంపై క‌న్నేసిన కేకేఆర్ నిర్ణీత ఓవ‌ర్లలో 7 వికెట్ల న‌ష్టానికి 272 ప‌రుగుల స్కోర్ కొట్టింది. త‌ద్వారా ఐపీఎల్‌లో అత్య‌ధిక స్కోర్ బాదిన రెండో జ‌ట్టుగా కోల్‌క‌తా హిస్టరీ క్రియేట్ చేసింది. మొద‌ట‌ ఓపెన‌ర్ సునీల్ న‌రైన్(85) అర్థ సెంచ‌రీతో చెల‌రేగ‌గా… అరంగేట్ర కుర్రాడు అంగ్‌క్రిష్ రాఘువంశీ(54) ఢిల్లీ బౌల‌ర్ల‌కు చుక్కలు చూపిస్తూ ఉరుకులు పరుగులు పెట్టించాడు.

కోల్‌క‌తా బ్యాట‌ర్ల వీర‌బాదుడు చూస్తుంటే... ఐపీఎల్ రికార్డు స్కోర్ 277 బ‌ద్ధ‌లవుతుంది ఖాయం అనిపించింది. కానీ, ఢిల్లీ బౌల‌ర్లు చివ‌ర్లో అద్భుతంగా కోల్‌క‌తా హిట్ట‌ర్ల‌ను క‌ట్ట‌డి చేశారు.టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కేకేఆర్ కు ఓపెన‌ర్లు ఫిలిఫ్ సాల్ట్(15), న‌రైన్‌(85)లు మంచి ఆరంభాన్ని అందించారు. ఇషాంత్ శ‌ర్మ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవ‌ర్‌తో న‌రైన్ ప‌రుగుల వేటను షురూ చేశాడు. బౌల‌ర్లు మారినా.. బంతి ల‌క్ష్యం బౌండ‌రీయే అన్న‌ట్టు చెల‌రేగి ఆడాడు. దాంతో, స్కోర్‌బోర్డు రాకెట్ వేగంతో ప‌రుగులు పెట్టింది. ఆండ్రూ ర‌స్సెల్‌(41), శ్రేయ‌స్ అయ్య‌ర్‌(18) విధ్వంసాన్ని కొన‌సాగించారు.. కోల్‌క‌తా స్కోర్ 230 దాటించారు. చివ‌ర్లో.. రింకూ సింగ్‌(26) సిక్స‌ర్ల‌తో రెచ్చిపోవ‌డంతో అయ్య‌ర్ సేన భారీ స్కోర్ పెరిగింది. ఢిల్లీ బౌల‌ర్ల‌లో నార్జియా మూడు వికెట్లు తీసుకున్నాడు.

ఇది కూడా చదవండి : ‘మిడిల్ క్లాస్ హీరో’33 ఏళ్ల సుదీర్ఘ పార్లమెంటరీ ప్రస్థానానికి తెర..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

పహల్గాంలో ఉగ్రవాదులు దాడిచేసి 28మందిని పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి తామే కారణమని లష్కర్‌ తోయిబా అనుబంధ సంస్థ రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌) ప్రకటించుకుంది. అయితే ఆ సంస్థ తాజాగా మాట మార్చింది. ఆ ఘటనతో తమకు సంబంధం లేదని ప్రకటించింది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

Pahalgam Terror Attack : పహల్గాంలో ఉగ్రవాదులు దాడిచేసి 28 మందిని పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి లష్కర్‌ తోయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌) కారణమని ప్రకటించుకుంది. అయితే అనుహ్యంగా ఆ సంస్థ తాజాగా మాట మార్చింది. ఆ ఘటనతో తమకు సంబంధం లేదని ప్రకటించింది.  ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. "ఇంతకు ముందు వచ్చిన ప్రకటనతో మాకు సంబంధం లేదు. భారత్‌ మా వ్యవస్థల్ని హ్యాక్‌ చేసి ఆ మెసేజ్‌ పోస్టు చేసింది. దీనిపై ఇప్పటికే పూర్తి దర్యాప్తు చేస్తున్నాం. రాజకీయ ప్రయోజనాల కోసం భారత్‌ ఇలా చేయడం  ఇదేమీ తొలిసారి కాదు' అని ఆరోపించింది.

మరో వైపు  భారత్‌ దెబ్బకు పాకిస్థాన్‌ ఉ... పోసుకుంటుంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో సింధు నీళ్ల కోసం పాక్‌ విలవిలలాడుతోంది.  పాక్ ప్రధానిలో  భయం మొదలైంది. సింధు నీళ్లు ఆపడంతో పాక్‌ కాళ్ల బేరానికి వచ్చేందుకు సిద్ధమైంది. పహల్గామ్ ఉగ్రదాడిపై విచారణకు సిద్ధమని ప్రకటించింది. మాకు మంచినీళ్లు కావాలని పాక్‌ ప్రధాని స్పష్టం చేశాడు. మా 25 కోట్ల జనానికి సింధు నీళ్లే జీవన ఆధారం అంటూ కొత్త రాగం అందుకున్నాడు. నీళ్ల కోసం మా ప్రయత్నాలు కొనసాగిస్తామంటూ చెప్పుకొచ్చాడు.

Also Read: ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!

కాగా జమ్మూ కాశ్మీర్‌‌‌‌ పహల్గామ్‌‌‌‌లోని బైసరన్ లో జరిగిన ఉగ్రదాడి ఘటనకు పాకిస్తాన్‌‌‌‌కు చెందిన లష్కర్- ఏ-తొయిబా (ఎల్‌‌‌‌ఈటీ) అనుబంధ సంస్థ అయిన "ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌‌‌‌ఎఫ్)" బాధ్యత వహించిన విషయం తెలిసిందే. ఈ దాడి వెనుక ఎల్‌‌‌‌ఈటీ సీనియర్ కమాండర్ సైఫుల్లా కసూరీ మాస్టర్‌‌‌‌మైండ్‌‌‌‌గా ఉన్నట్లు తెలుస్తుంది.  అలాగే దాడికి పాల్పడిన టీఆర్‌‌‌‌ఎఫ్ బృందానికి ఆసిఫ్ ఫౌజీ నాయకత్వం వహించినట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్‌‌‌‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం  రద్దు చేసింది. అయితే, చర్య తర్వాతే టీఆర్‌‌‌‌ఎఫ్ ఏర్పడింది. అప్పటి నుంచి అడపాదడపా జమ్మూ కాశ్మీర్‌‌‌‌లో టెర్రరిస్టుల దాడులు జరుగుతూనే ఉన్నాయి. 

Also Read: సరిహద్దుల్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు!

పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కర్- ఏ-తొయిబా (ఎల్‌‌‌‌ఈటీ) సీనియర్ కమాండర్ సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీదే పహల్గామ్ దాడికి ప్రధాన సూత్రధారిగా తెలుస్తున్నది. కసూరిని ఎల్‌‌‌‌ఈటీ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌‌‌‌కు సన్నిహితుడిగా కూడా చెబుతున్నారు. హఫీజ్ సయీద్.. జమాత్- ఉద్ -దవా (జేయూడీ) రాజకీయ సంస్థ మిల్లీ ముస్లిం లీగ్ (ఎంఎంఎల్) అధ్యక్షుడిగా సైఫుల్లా కసూరిని పరిచయం చేశాడు. ఈ జేయూడీనే 2016లో యూఎస్ డిపార్ట్‌‌‌‌మెంట్ ఆఫ్ స్టేట్.. ఎల్‌‌‌‌ఈటీకి పేరు మార్చుకుంది. దీన్ని2008లో ఐక్యరాష్ట్ర సమితి ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. 

Also Read: Indus Waters : మిస్టర్ మోదీ..సింధూలో నీళ్లు పారకపోతే రక్తం పారుతుంది: బిలావల్‌ భుట్టో హెచ్చరిక

Advertisment
Advertisment
Advertisment