Rana Daggubati: రహస్యంగా రానా తమ్ముడి వివాహం..అమ్మాయి ఎవరంటే!

నిర్మాత దగ్గుబాటి సురేష్‌ చిన్న కుమారుడు అభిరామ్‌ వివాహం డిసెంబర్‌ 4న శ్రీలంక లో జరుగుతుందని సమాచారం. ఈ వివాహం గురించి ఇప్పటి వరకు దగ్గుబాటి ఫ్యామిలీ బయట ఎక్కడ కూడా చెప్పలేదు.

New Update
Rana Daggubati: రహస్యంగా రానా తమ్ముడి వివాహం..అమ్మాయి ఎవరంటే!

ఈ సంవత్సరం తెలుగు ఇండస్ట్రీకి చెందిన హీరోలందరూ ఓ ఇంటి వారవుతున్నారు. ఇప్పటికే మెగా కంపౌడ్ నుంచి మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ నటి లావణ్య త్రిపాఠితో ఏడడగులు వేశాడు. ఇప్పుడు ఈ లిస్ట్‌ లోకి మరో కుర్ర హీరో చేరుతున్నాడు. అతను మరెవరో కాదు దగ్గుబాటి వారసుడు దగ్గుబాటి అభిరామ్‌.

అభిరామ్‌ నిర్మాత దగ్గుబాటి సురేష్‌ చిన్న కుమారుడు. రానా కి తమ్ముడు. ఈ ఏడాది దర్శకుడు తేజ దర్శకత్వంలో వచ్చిన అహింస చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. కానీ ఆ చిత్రం అనుకున్న విజయం సాధించకపోవడంతో పెద్దగా పేరు రాలేదు. అభిరామ్‌ కి హీరోగా నిలబడాలి అంటే చాలా సమయం పడుతుందనే చెప్పవచ్చు.

ఇదిలా ఉంటే గత కొంత కాలం నుంచి అభిరామ్‌ పెళ్లి వార్తలు సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం...అభిరామ్‌కి ఓ వ్యాపార వేత్త కుమార్తె అయినటువంటి ప్రత్యూష చపరా తో డిసెంబర్‌ 4న శ్రీలంకలో వివాహం జరుగుతుందని తెలుస్తుంది.

శ్రీలంకలోని ఫైవ్‌ స్టార్‌ రిసార్ట్‌ అనంతర కలుతారాలో వీరి పెళ్లి చాలా గ్రాండ్‌ గా జరగనుందని సమచారం. అయితే ఇప్పటి వరకు అభిరామ్ పెళ్లి గురించి దగ్గుబాటి ఫ్యామిలీ బయటపెట్టలేదు. ఎక్కడ సమాచారం కూడా తెలపలేదు. కాగా ఇప్పటికే దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం కూడా లంకకు బయల్దేరినట్లు సమాచారం.

ఈ వివాహం 5 రోజుల పాటు జరుగుతుందని సమాచారం. అయితే ఈ పెళ్లికి ముఖ్య అతిథులుగా కేవలం 200 మంది మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం. పెళ్లి అయిన తరువాత హైదరాబాద్‌ కి తిరిగి వచ్చి గ్రాండ్‌ గా రిసెప్షన్‌ ఏర్పాటు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పెళ్లి ఇంత సీక్రెట్ గా చేయడం వెనుక కారణం ఏంటి అంది తెలియాల్సి ఉంది.

Also read: మా విజయం అమరవీరులకు అంకితం:రేవంత్ రెడ్డి !

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

రవితేజ ‘మాస్ జాతర’ నుంచి వచ్చేసిన మాస్ సాంగ్.. చూపుల్తో గుచ్చి గుచ్చి.. మ్యూజిక్, స్టెప్స్‌తో అదిరిపోయాయిగా!

మాస్ మహారాజ్ రవితేజ "మాస్ జాతర" మూవీ నుంచి ‘తు మేరా లవర్’ లిరికల్ సాంగ్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. చూపుల్తో గుచ్చి గుచ్చి మ్యూజిక్, సెప్స్‌తో వింటేజ్ రవితేజను గుర్తుచేశారు. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది.

New Update

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) "మాస్ జాతర" మూవీతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్నాడు. భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన తు మేరా లవర్ అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటలో ఇడియట్ సినిమాలోని చూపుల్తో గుచ్చి గుచ్చి బీట్, డ్యాన్స్‌ను రీమేక్ చేసి మధ్యలో యాడ్ చేశాడు.  

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

ఇది కూడా చూడండి: AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

వింటేజ్ రవితేజను గుర్తు చేసేలా..

ఈ పాట అప్పట్లో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అవే స్టెప్‌లు, మ్యూజిక్‌ వింటేజ్ రవితేజను గుర్తు చేశాయి. ఈ మాస్ సాంగ్‌లో రవితేజ, శ్రీలీల మాస్ బీట్స్‌తో అదరిగొడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పాట ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

Advertisment
Advertisment
Advertisment