Ayodhya Ram Mandir : అయోధ్య క్రేజ్‎ను క్యాష్ చేసుకుంటున్న సైబర్ కేటుగాళ్లు...ఆ లింక్ క్లిక్ చేశారో అంతే సంగతులు..!!

అయోధ్య భవ్య రామమందిరం ఈనెల 22న ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. రామయ్యను దర్శించుకోవాలని దేశ ప్రజలంతా ఊవ్విళ్లూరుతున్నారు. అయోధ్యారాముడి క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. అయోధ్యకు స్పెషల్ ఆఫర్లు, వోచ్చర్లు, పాస్ ల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు.

New Update
Ayodhya Ram Mandir : అయోధ్య క్రేజ్‎ను క్యాష్ చేసుకుంటున్న సైబర్ కేటుగాళ్లు...ఆ లింక్  క్లిక్ చేశారో అంతే సంగతులు..!!

Ayodhya Ram Mandir :  అయోధ్యరాముడి భవ్య మందిర నిర్మాణం పూర్తయ్యింది. ఈనెల 22వ తేదీని దేశప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) చేతుల మీదుగా రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని రామయ్యను దర్శించుకోవాలని దేశప్రజలంతా ఊవ్విళ్లూరుతున్నారు. అయితే రాముడి క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు సైబర్ కేటుగాళ్లు(Cyber threats) ప్లాన్ చేస్తున్నారు. అయోధ్యకు స్పెషల్ ఆఫర్లు(Special offers,), వోచర్లు(Vouchers), పాస్ ల పేరుతో అందినకాడికి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయోధ్య రామామందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి కొద్దిమందికి మాత్రమే ఆహ్వానం అందింది. దీంతో లక్షలాది మంది భక్తులు రామయ్యను దర్శించుకునే వీలులేకుండా పోయింది. అయితే ఈ సంబురాలను నేరుగా తిలకించాలన్న కోరికతో ఉన్న భక్తులను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు రకరకాల ప్లాన్స్ చేస్తున్నారు. ఇందుకోసం నకిలీ టికెట్ల పేరుతో దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వీఐపీ టికెట్లు(VIP tickets) అందుబాటులో ఉన్నాయని..అవి మీకోసం అందిస్తున్నామని సైబర్ నేరగాళ్లు భక్తులకు మెసేజ్ లు పంపిస్తున్నారు. వీటిని క్లిక్ చేసిన వెంటనే వారి ఖాతాల్లోనుంచి డబ్బులు కొట్టేస్తున్నారు.

ఇది కూడా చదవండి: మీ ఇంటికే అయోధ్యారాముడి మహాప్రసాదం..ఇలా స్వీకరించండి..!!

ఈ విషయం కాస్త పోలీసులకు చేరింది. దీంతో సైబర్ నేరగాళ్లపై నిఘా పెట్టారు. ఇలాంటి మోసగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఏపీకే ఫైల్స్ (apk files)డౌన్ లోడ్ చేసుకుంటే ముప్పు తప్పదంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీనిద్వారా మాల్వేర్ ను మన మొబైల్స్, కంప్యూటర్స్, లాప్ టాప్ లలోకి చొప్పించి లాగిన్ వివరాలు , పాస్ వర్డ్స్ , కాంటాక్ట్ నెంబర్స్, క్రెడిట్ కార్డు వివరాలు వంటి సమాచారాన్ని సేకరించే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అపరిచుతల నుంచి వచ్చే మెసేజ్ లు, ఈమెయిల్స్(Emails) ను సాధ్యమైనంత వరకు క్లిక్ చేయకుండా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Advertisment