Cyber Crime from Cambodia: కంబోడియా అడ్డాగా సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి? కళ్ళకు కట్టినట్టు వివరించిన బాధితుడు!

కంబోడియా సైబర్ నేరాలకు కేరాఫ్ ఎడ్రస్ గా మారింది. అక్కడ ఇటీవల సైబర్ నేరానికి చిక్కిన బాధితుడు మున్సిఫ్ ప్రకాష్ సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి అనే విషయాన్ని RTV పూసగుచ్చినట్టు వివరించాడు. ఆ వివరాలు ఆర్టికల్ లోనూ.. ఇక్కడి  వీడియోలోనూ మీరు చూడొచ్చు. 

New Update
Cyber Crime from Cambodia: కంబోడియా అడ్డాగా సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి? కళ్ళకు కట్టినట్టు వివరించిన బాధితుడు!

Cyber Crime from Cambodia: సైబర్ నేరాల విషయంలో కంబోడియా ప్రపంచానికే తలనొప్పిగా మారింది. మరీ ముఖ్యంగా భారతదేశంలోని వ్యక్తులనే టార్గెట్ చేస్తున్నారు కంబోడియా సైబర్ నేరగాళ్లు. మన దేశీయులతో అక్కడ నేరాలు చేయిస్తూ.. మన దేశీయులే టార్గెట్ గా సైబర్ నేరాలు చేస్తున్నారు కంబోడియన్లు. వారి చేతిలో చిక్కుకుని చిత్ర హింసల పాలైన బాధితుడు మున్సిఫ్ ప్రకాష్ కంబోడియాలో సైబర్ నేరాలు ఎలా చేస్తారో వివరించారు. 

ఉద్యోగాల పేరుతో ట్రాప్..
మన దేశంలోని అమాయక యువకులను ఉద్యోగాల పేరుతో కంబోడియాలో సైబర్ నేరగాళ్లు ట్రాప్ చేస్తున్నారని ప్రకాష్ చెప్పారు. అంతేకాకుండా ఏఐ టెక్నాలజీతో అమ్మాయిల పేరుతో వలపు వాల విసురుతున్నారు. దీనికి చిక్కుకున్నా భారతీయులు తరువాత అక్కడ ఈ నేరగాళ్ల చెరలో చెప్పలేని కష్టాలు పడుతున్నారని ప్రకాష్ అంటున్నారు. ఇలా వారి వలలో చిక్కిన భారత యువకులతో  ట్రేడింగ్ అప్లికేషన్ పేరుతొ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ అని చెప్పి సైబర్ మోసాన్ని మన దేశంలో నిర్వహించేలా చేస్తున్నారు. వారు చెప్పినట్టు చేయకపోతే చిత్రహింసలు పెడుతోంది  కంబోడియాలో సైబర్ మాఫియా. ఇప్పటికే 3 వేలకు పైగా కేరళ వాసులు కంబోడియాలో చిక్కుకున్నారు. 180 మందికి పైగా తెలుగు యువకులు అక్కడి సైబర్ మాఫియా చేతిలో చిక్కుకుని ఉన్నారు. 

భారతీయులతో భారతీయులపైనే వల..
Cyber Crime from Cambodia: కంబోడియాలో సైబర్ నేరగాళ్లు చాలా తెలివిగా భారతీయుల్ని ట్రాప్ చేస్తున్నారు. మన దేశంలోని యువతలో ఉన్న ఆన్ లైన్ చాటింగ్ వ్యామోహాన్ని వాళ్ళు అవకాశంగా మలుచుకుంటున్నారు. ముందు భారతీయులతో లవ్, బిజినెస్, ట్రేడింగ్, గేమింగ్ పేరుతో చాటింగ్ ప్రారంభిస్తారు. నమ్మకం కుదిరేవరకూ చాటింగ్ కొనసాగిస్తారు. తరువాత డబ్బులు వసూలు చేస్తారు. ఆ తరువాత ఆన్ లైన్ నుంచి మాయం అయిపోతారు. ఇందుకోసం ఏఐ టెక్నాలజీని కూడా విరివిగా వాడుతున్నారు కంబోడియా సైబర్ నేరగాళ్లు. వారితో ఛాటింగ్ చేసే వారి ప్రాంతాన్ని బట్టి ఏఐ టెక్నాలజీతో అదే యాసలో మాటలు ఉండేలా చేస్తున్నారు. దీంతో సులభంగా వారిని నమ్మేస్తున్నారు ఇక్కడి ప్రజలు. 

Cyber Crime from Cambodia: ఇక ఏఐ ద్వారా యువతీ యువకులను ప్రేమ వలతో ఆకట్టుకుంటారు. ఆ తరువాత న్యూడ్ కాల్స్ చేసేంతగా వారిని ప్రేరేపిస్తారు. ఒక్కసారి ఇలా న్యూడ్ కాల్స్ కి దొరికిపోతే ఇక అంతే సంగతులు. అటువంటి వారి జీవితం వారి చేతిలో చిక్కుకున్నట్టే. అక్కడి నుంచి బ్లాక్ మెయిల్ పర్వం ప్రారంభం అయిపోతుంది. మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియోలు పంపిస్తామంటూ బెదిరింపు స్టార్ట్ చేస్తారు. ఆ తరువాత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరిస్తారు. ఇలా దశల వారీగా బ్లాక్ మెయిల్ చేస్తారు. 

ఇది ఎలా బ్రేక్ అయింది?
కేరళ కొట్టాయంలో ముఫ్లిక్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 200 సిమ్ కార్డులు తో ముఫ్లిక్ పట్టుబడ్డాడు. ఇతను మన దేశం నుంచి 80 మందిని అక్రమంగా కంబోడియా తరలించాడు. ఇలా వెళ్లిన వారిలో ప్రకాష్ కూడా ఒకరు. ఈయన అక్కడ నుంచి తప్పించుకుని తిరిగి వచ్చారు. 

Cyber Crime from Cambodia: తాను ఈ వలలో ఎలా చిక్కుకున్నారో వివరించారు ప్రకాష్. దాని ప్రకారం.. ఆయన తమిళనాడు నుండి విజయ్ అనే వ్యక్తి ద్వారా కాంబోడియా వెళ్లారు. అక్కడికి వెళ్ళాకా అక్కడ చిక్కుకున్న భారతీయులను చూసి వారికీ సహాయం చేయాలని భావించారు.  అక్కడ ఆయనకు  ఓకే వీఐపీ బిల్డింగ్ లో మొత్తం భారతీయులే కనిపించారు. వీరిలో ఎక్కువగా కేరళ తమిళనాడు నుండి బాధితులు ఉన్నారు. వారిలో 20 శాతం మంది తెలుగువారు ఉన్నారు. ఏపీ నుంచి మహిళలు ఎక్కువగా ఉన్నారని ప్రకాష్ చెప్పారు. అక్కడ వారందరినీ చూసి బాధపడిన ప్రకాష్ తాను ఆ వల నుంచి తప్పించుకోవడమే కాకుండా మరో 9 మందిని అక్కడ నుంచి విడిపించారు. ఆయన అక్కడ నుంచి బయటపడటానికి ఇండియన్ ఎంబసీ నుండి అబ్రహం చాలా హెల్ప్ చేశారు. తనకు, ఆ తొమ్మిది మందికి ఎంబసీ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సహాయం చేసిందని ఆయన చెప్పారు. 

ఆ నాలుగు ప్రాంతాలే.. publive-imageకంబోడియాలో మేజర్ సైబర్ నేరాలలకు అడ్డాలుగా ఫినోపిన్, బావట్, ఓకే విఐపి, గెలాక్సీ బిల్డింగ్ ఉన్నాయని ప్రకాష్ చెప్పారు. ఇక్కడ చిక్కుకున్న వారు గూగుల్ లో ఇండియన్ ఎంబసీ నెంబర్ తీసుకుని కాల్ చేయవచ్చు. లేదా అక్కడే కనిపించే వాట్సాప్, ఈమెయిల్ వంటి వాటి ద్వారా కూడా ఎంబసీని కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో ఉంటుంది. వీటి ద్వారా ఎంబసీకి తమ పరిస్థితి వివరించి అక్కడ నుంచి బయటపడే దారిని సాధించవచ్చని ఆయన చెప్పారు. 

ఆన్ లైన్ ట్రేడింగ్ అంతా బూటకం.. దాని జోలికి పోవద్దు..

publive-image

మన దేశంలో ప్రజలు ఆన్ లైన్ ట్రేడింగ్ కు ఎక్కువగా బలి అయిపో

తున్నారని ప్రకాష్ అంటున్నారు. ఈ ట్రేడింగ్ అంతా బూటమే అని ఆయ

న చెప్పారు. “పేరుకు మాత్రమే మనకు ప్రాఫిట్ కనిపిస్తుంది. దానిని చూసి డేటింగ్,  ట్రేడింగ్,  గేమింగ్... లలో ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టారా ఇక అంతే

సంగతులు. ట్రేడింగ్ అప్లికేషన్ లో గ్రాఫ్ ఇంక్రీజ్ డిక్రీస్ కావడానికి రిమోట్ కేటుగాళ్ల చేతిలోనే ఉంటుంది. అందులో మనకు సేల్,  బై పోర్టు పోలియోలో ఆప్షన్స్ మాత్రమే కనిపిస్తాయి. డిసి  బాక్స్ అనే అప్లికేషన్ లో విత్ డ్రా ఆప్షన్ ఉంటుంది.. కానీ అది పనిచేయదు.” అని ప్రకాష్ వివరించారు.   కలర్ ట్రేడింగ్ అనేది అంతా మోసమే అనీ  యూట్యూబర్లో వచ్చే యాడ్స్  స్ట్రైక్ చేయాలనీ ప్రకాష్ చెబుతున్నారు. యూట్యూబర్స్ కూడా వీటిని ప్రమోట్ చేయవద్దని ప్రకాష్ కోరుతున్నారు. ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలనీ, ఉద్యోగాల పేరుతో మోసం చేసే కంపెనీలపై చర్యలు తీసుకోవాలనీ ప్రకాష్ విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రకాష్ RTV తో చెప్పిన విషయాలన్నింటినీ ఈ క్రింది వీడియోలో మీరు చూడొచ్చు.. 

Advertisment
Advertisment
తాజా కథనాలు