Praja Palana Application : ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీపై సీఎస్ కీలక ఆదేశాలు

తెలంగాణలో రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు తీసుకుంటారు. ఇప్పుడు వీటి విషయంలో సీఎస్ శాంతికుమారి జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలను జారీ చేశారు. ఈ నెల 17లోగా డేటా ఎంట్రీ పూర్తి చేయాలని చెప్పారు.

New Update
Praja Palana Application : ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీపై సీఎస్ కీలక ఆదేశాలు

CS Santhi Kumari : తెలంగాణ(Telangana) లో అభయ హస్తం(Abhaya Hastham), ప్రజాపాలన(Praja Palana) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తోంది రేవంత్(Revanth Reddy) ప్రభుత్వం. అందుకు తగ్గట్టే జిల్లా కలెక్టర్లకు, అదికారులకు ఆదేశాలు జారీ చేస్తోంది. ఒకదాని తర్వాత ఒకటి పథకాలను అమలు చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తుల విషయంలోనే శ్రద్ధ పెట్టింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన దరఖాస్తు ఫామ్‌లను తీసుకుంటారు. వీటి డేటా ఎంట్రీ ని వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(CS Santhi Kumari) జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ నెల 17లోగా మొత్తం డేటా ఎంట్రీ అయిపోవాలని చెప్పారు. 6వ తేదీన ప్రజావాణి ముగిసిన వెంటనే దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టాలని సూచించారు. మండల రెవెన్యూ అధికారులు, మండల అభివృద్ధి అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో డేటా ఎంట్రీ చేపట్టాలని సూచించారు.

Also read:బీఆర్ఎస్ కు రేవంత్ సర్కార్ షాక్.. తెలంగాణ భవన్ కు రెవెన్యూ శాఖ నోటీసులు!

ఇక డేటా ఎంట్రీ కోసం 4, 5 తేదీల్లో అధికారులకు, కలెక్టర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. బీమా దరఖాస్తుల డేటా ఎంట్రీ(Data Entry) ని 6వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పూర్తి చేయాలి. డేటా ఎంట్రీలో ఆధార్ నంబర్, తెల్ల రేషన్ కార్డు(Ration Cards) ను ప్రామాణికంగా తీసుకోవాలి. ఈ పనుల్నీ సక్రమంగా జరగడానికి డీటీపీ ఆపరేటర్ల సేవలను వినియోగించుకోవాలని… అవసరమైతే ప్రైవేట్ ఆపరేటర్లను నియమించుకోవాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. ఈ మొత్తం పనిని ప్రజా పరిపాలన కార్యక్రమానికి పర్యవేక్షక అధికారిగా ఉన్న జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షించాలని ఆదేశించారు.

ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఐదు ప్రత్యేక పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, యువ వికాసం పథకాలు ఉన్నాయి. ఒక్కో పథకానికి విడివిడిగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా, ఏ పథకానికి అర్హులైన వారు దరఖాస్తు ఫారమ్‌లో ఆ పథకానికి అవసరమైన వివరాలను మాత్రమే నింపాలి. అన్ని పథకాలకు సంబంధించిన నిలువు వరుసలు ఒకే రూపంలో ఇవ్వబడ్డాయి. దరఖాస్తు ఫారంతో పాటు రేషన్ కార్డు జతచేయాలి. దీంతో పాటూ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలు, దరఖాస్తుదారు ఫోటోగ్రాఫ్ జతచేయాల్సి ఉంటుంది.

#praja-palana #santhi-kumari #telangana #cs #abhaya-hastam
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవ...

Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

సంస్థలో ఆశించిన మేర పని చేయని ఉద్యోగుల పట్ల ఓ సంస్థ అమానవీయంగా ప్రవర్తించిన ఘటన కేరళలో చోటు చేసుకుంది.శునకాల మాదిరిగా మోకాళ్ల పై నడవాలని,నేల పై ఉంచిన కరెన్సీ నాణేలను నాలుకతో తీయాలని ఆదేశించిందట.

New Update
kerala emp

kerala emp

సంస్థలో ఆశించిన మేర పని చేయని ఉద్యోగుల పట్ల ఓ సంస్థ అమానవీయంగా ప్రవర్తించిన ఘటన కేరళలో చోటు చేసుకుంది.శునకాల మాదిరిగా మోకాళ్ల పై నడవాలని,నేల పై ఉంచిన కరెన్సీ నాణేలను నాలుకతో తీయాలని ఆదేశించిందట. దీనికి సంబంధించిన వీడియోలు స్థానిక మీడియాలో ప్రసారం కావడంతో స్పందించిన కార్మిక శాఖ పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది.

Also Read: Iran: చరిత్రలో రికార్డ్ స్థాయికి పడిపోయిన ఇరాన్ కరెన్సీ విలువ.. డాలర్‌కు 10 లక్షల రియాల్స్‌..

ఓ సంస్థలో పని చేస్తున్న వ్యక్తి మెడకు బెల్టు కట్టి ఉండగా...అతడిని మరో వ్యక్తి మోకాళ్ల పై కుక్కలా నడిపించుకుంటూ వెళ్తున్నాడు. మరికొందరు నాలుకతో నాణేలు తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానిక మీడియాలో ప్రసారమయ్యాయి. ఈ విషయమై కొందరు ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతూ...నిర్దేశించిన టార్గెట్‌ ను పూర్తి చేయని ఉద్యోగుల పై తమ సంస్థ ఈ విధమైన వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.

Also Read: Local Body Elections : ఆ పదిస్థానాలకు ఎన్నికలు...మరో ఎన్నికలకు సై అంటోన్న రెండు పార్టీలు

పోలీసుల సమాచారం ప్రకారం..కలూరులోని ఓ ప్రైవేటు మార్కెటింగ్‌ సంస్థతో సంబంధం ఉన్నట్లు తెలిసిందన్నారు.ఘటన మాత్రం పెరుంబవూర్‌ బ్రాంచీలో జరిగినట్లు తెలుస్తోందన్నారు. అయితే యజమాని మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చినట్లు తెలిసింది.దీని పై ఉద్యోగులు ఇప్పటి వరకు ఎవరికీ ఫిర్యాదు చేయలేదని సమాచారం.

ఈ అమానవీయ ఘటన పై కేరళ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ దృశ్యాలు షాక్‌ కు గురి చేశాయని ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శివన్‌ కుట్టి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని ఆయన వెల్లడించారు. ఈ ఘటన పైపూర్తి స్థాయి నివేదికను అందించాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 

Also Read: TDP vs Jana Sena : పిఠాపురంలో రచ్చరచ్చ..రెండోరోజు నాగబాబుకు తప్పని నిరసన సెగ

Also Read: Tariffs Effect: ట్రంప్ సుంకాల దెబ్బ.. భారీగా పడిపోతున్న చమురు ధరలు

 kerala | employees | tortured | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment