/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-08T165026.977.jpg)
AP Crime: ఏలూరు జిల్లా చింతలపూడిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యమీద కోపంతో బాలాజీ అనే సీఆర్ ఫీఎఫ్ కానిస్టేబుల్ నెలల పసికందును హతమార్చాడు. ఈ మేరకు కుటుంబ కలహాల నేపథ్యంలో కొంతకాలంగా గొడవలు జరుగుతుండగా.. పాత కేసు విషయంలో ఈరోజు ఏలూరు కోర్ట్ కు వచ్చిన బాలాజీ కేసు విషయంలో భార్య, మామతో గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే భార్య, మామను అక్కడే చితకబాదిన బాలాజీ.. ఆపై లింగపాలెం మండలం పాశ్చానగరంలో మరదలు ఇంటికెళ్లి అత్త, మరదలుపై దాడి చేశాడు. ఈ క్రమంలోనే ఉక్రోషంతో మరదలి కుమారుడైన రెండు నెలల పసికందును తలపై గాయపరిచడంతో పసిగుడ్డు అక్కడే ప్రాణాలొదిలాడు. అయితే ఈ దారుణాన్ని గమనించిన స్థానికులు బాలాజీని అడ్డుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలజీను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ధర్మజిగూడెం పోలీసులు తెలిపారు.