/rtv/media/media_files/2026/06/16/delhi-teche-2026-06-16-18-45-33.jpg)
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ముస్సోరీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి ఒక హోమ్‌స్టేలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె గురుగ్రామ్‌లోని ఒక ఐటీ సంస్థలో పని చేస్తూ, ఢిల్లీలోని కిద్వాయ్ నగర్ ఈస్ట్‌లో నివసిస్తోంది. తన భర్త సౌమ్య శ్రీచరణ్‌తో కలిసి ముస్సోరీకి విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. శ్రీచరణ్ కూడా ఐటీ రంగంలోనే పని చేస్తూ పుణెలో ఉంటున్నాడు. వీరిద్దరిది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం కాగా గతేడాది నవంబర్ 8, 2025 న వీరికి వివాహం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ దంపతులు ఢిల్లీ నుంచి బయలుదేరి ముందుగా రిషికేష్ చేరుకున్నారు. ఆ తర్వాత జూన్ 14వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ముస్సోరీలోని టిప్రీధర్ ప్రాంతంలో ఉన్న కియానా హోమ్‌స్టేకు చేరుకున్నారు. అక్కడ వారు రాత్రి 11:30 గంటల సమయంలో 'బ్లిస్' అనే రూమ్‌లోకి చెక్-ఇన్ అయ్యారు. ఆ రాత్రి తామిద్దరం కలిసి మద్యం సేవించామని, ఆపై తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో నిద్రపోయినట్లు భర్త శ్రీచరణ్ పోలీసులకు తెలిపాడు. అయితే ఉదయం తను నిద్రలేచి చూసేసరికి భార్య గాయత్రి ఒంటిపై బట్టలు లేకుండా, స్పృహ తప్పి నేలపై పడి ఉండటాన్ని గమనించాడు. ఆమె ముక్కు నుంచి రక్తం కారుతుండటంతో పాటు, మూత్రం, రక్తపు మడుగులో ఆమె మృతదేహం పడి ఉందని అతడు పేర్కొన్నాడు.
స్పృహ తప్పి పడి
సోమవారం ఉదయం హోమ్‌స్టేలో ఒక మహిళ స్పృహ తప్పి పడి ఉందనే సమాచారం రావడంతో ముస్సోరీ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారితో పాటు 108 అంబులెన్స్ కూడా అక్కడికి వచ్చింది. అంబులెన్స్‌లో ఉన్న ఫార్మసిస్ట్ ఆమెను పరీక్షించి, అప్పటికే ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. గాయత్రి మృతదేహం బట్టలు లేకుండా నేలపై పడి ఉందని, బెడ్‌షీట్‌పై రక్తపు మరకలు ఉన్నాయని పోలీసులు తమ ప్రకటనలో స్పష్టం చేశారు. అలాగే వారున్న గది నుంచి రెండు ఖాళీ మద్యం సీసాలను, తినుబండారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం గాయత్రి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్షల నిమిత్తం డెహ్రాడూన్‌లోని కోరోనేషన్ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో మరణానికి గల అసలు కారణాలను తెలుసుకోవడానికి వైద్యుల బృందంతో పోస్ట్‌మార్టం నిర్వహించాలని, ఆ ప్రక్రియ మొత్తాన్ని పూర్తిగా వీడియో రికార్డింగ్ చేయాలని పోలీసులు ఆసుపత్రి వర్గాలను కోరారు. పెళ్లయిన కొద్ది నెలలకే హనీమూన్ ట్రిప్‌లో భార్య ఇలా అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది.
Follow Us