/rtv/media/media_files/vxPR1S6Lcuaa3vh3qUzK.jpg)
Gas
పశ్చిమ బెంగాల్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు ఒకే కుటుంబంలో అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు, నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో మరికొందరికి తీవ్ర గాయాలు కూడా అయినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Ashwani Kumar : డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
నిల్వ ఉంచిన క్రాకర్స్ వల్ల..
గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో ఇళ్లు మొత్తం ధ్వంసమైంది. అయితే ఇంట్లో ఫైర్ క్రాకర్స్ నిల్వ ఉంచగా.. వాటికి మంటలు అంటాయి. దీంతో మంటలు వ్యాపించి సిలిండర్ పేలినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: Ap Weather Alert: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!
ఇదిలా ఉండగా.. వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువకుడు వదిలిన సిగరెట్ పొగ మరో యువకుడి పైకి వెళ్లడంతో ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. దీంతో సిగరెట్ తాగిన యువకుడిని తొమ్మిది మంది కలిసి దారుణంగా కొట్టి చంపేశారు.ఈ ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్లలో చోటుచేసుకుంది. పర్వతగిరి సీఐ రాజగోపాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సంగెం మండలం కుంటపల్లికి చెందిన చిర్ర ధని, అతడి సోదరుడు చిర్ర బన్నీ (21), తల్లి పూల, సోదరి పూజిత, స్నేహితుడు గిరిబాబుతో కలిసి ఆదివారం రాత్రి గవిచర్లలో జరిగిన గుండ బ్రహ్మయ్య జాతరకు వెళ్లారు.
ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్!
కొద్దిసేపటి తర్వాత అందరూ ఇంటికి వెళ్లిపోగా.. బన్నీ మాత్రం తన స్నేహితులతో కలిసి అక్కడే ఉన్నాడు. ఈ సమయంలో బన్నీ ఓ పాన్ షాప్ వద్ద సిగరెట్ తాగుతున్నాడు. అయితే అతడు వదిలిన సిగరెట్ పొగ పక్కనే ఉన్న గవిచర్లకు చెందిన వేల్పుల సిద్ధు వైపుకు వెళ్లింది. దీంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి గొడవకు దారి తీసింది. అక్కడే ఉన్న సిద్దు అన్న వినయ్ వారికి నచ్చజెప్పి సిద్దుతో సారీ చెప్పించి అక్కడి నుంచి పంపించేశాడు. అయితే దీన్నే మనసులో పెట్టుకున్న సిద్దు.. తన మేనమాము గుండేటి సునీల్, ఫ్రెండ్స్ గుండేటి రాజు, కార్తీక్, మహేందర్, మెట్టుపల్లి భరత్, చిన్న భరత్, రాజ్కుమార్, కొమ్మాలుతో కలిసి వచ్చి బన్నీపై దాడి చేయడంతో మృతి చెందాడు.
ఇది కూడా చూడండి: IPL 2025: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్