దారుణం.. మైనర్‌ను ప్రెగ్నెంట్ చేసిన వృద్ధుడు

వరంగల్ జిల్లా మనుగొండ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ 60 ఏళ్ల వృద్ధుడు మైనర్‌‌ను గర్భవతిని చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కడుపు నొప్పిగా ఉందని ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు నిర్వహించగా ఈ విషయం బయటపడింది.

New Update
UP Crime : పంచాయతీ పెద్దల అరాచకం.. వివాహితను చెట్టుకు కట్టేసి.. చెప్పుల దండ మెడలో వేసి!

వరంగల్ జిల్లా గీసుకొండలో మైనర్‌పై అత్యాచారం చేసిన ఘటన చోటు చేసుకుంది. 60 ఏళ్ల వృద్ధుడు మైనర్‌పై దారుణానికి ఒడిగట్టాడు. మనుగొండ గ్రామానికి చెందిన పదకొండేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారం చేశాడు. వృద్ధుడు భార్య చనిపోవడంతో ఒంటరిగా నివసిస్తున్నాడు. ఆ గ్రామంలో వృద్ధుడు ఇంటికి దగ్గర ఉంటున్న ఆ బాలికను లొంగదీసుకుని చాలాసార్లు అత్యాచారం చేశాడు.

ఇది కూడా చూడండి: Israel: ఇరాన్‌ అతి పెద్ద తప్పు చేసింది..మూల్యం చెల్లించుకుంటుంది!

పరీక్షలు నిర్వహించగా..

మైనర్ బాలికకు కడుపు నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో ఈ బండారం బయటపడింది. వైద్యులు పరీక్షలు నిర్వహించగా ఆ బాలిక ప్రెగ్నెంట్ అని తెలియడంతో ఈ విషయం బయటకు వచ్చింది. పలుమార్లు లొంగదీసుకుని తనపై అత్యాచారం చేశాడని బాలిక తల్లిదండ్రులకు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

ఇది కూడా చూడండి: తెలంగాణలో ఘోర విషాదం.. ఆ కాలువలో గల్లంతైన యువకులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు