/rtv/media/media_files/2025/03/20/Lt2H8YqaVh1D5s2JqHpI.jpg)
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో విద్యార్థులను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 50 ఏళ్ల ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నగ్న వీడియోలను ఉపయోగించి విద్యార్థులను బ్లాక్ మెయిల్ చేశాడని, అలాగే లైంగిక వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలు అతనిపై ఉన్నాయి. హత్రాస్‌లోని సేథ్ ఫూల్ చంద్ బాగ్లా పీజీ కళాశాల చీఫ్ ప్రొక్టర్ రజనీష్ కుమార్ పై ఈ ఆరోపణలు వచ్చినప్పటి నుండి పరారీలో ఉన్నాడు, విద్యార్థులపై లైంగిక వేధింపులకు గురిచేసిన వీడియోలు పోలీసులకు చేరాయి.
Also read : నా కూతురిపై గ్యాంగ్ రేప్ .. ఆదిత్య ఠాక్రే కారణమంటూ హైకోర్టులో దిశ తండ్రి పిటిషన్
हाथरस के बागला महाविद्यालय का प्रोफेसर छात्राओं से रेप करता था, उनके साथ अश्लील हरकतें करने का वीडियो वायरल है।
— Vinay Saxena (@vinaysaxenaj) March 17, 2025
प्रयोगात्मक परीक्षाओं में फेल करने का डर और नौकरी लगवाने का प्रलोभन देकर यौन शोषण और दुष्कर्म करने, अश्लील वीडियो व फोटो बनाने का आरोप है। pic.twitter.com/4Uqbz8BVHh
ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్
రజనీష్ కుమార్ ఎంత మంది మహిళలను వేధించాడో తనకే తెలియదని వెల్లడించాడని పోలీసులు చెబుతున్నారు. విద్యార్థులకు పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేయడానికి, ఉద్యోగాలు ఇప్పించడానికి లంచాలు కూడా తీసుకున్నాడని, లైంగిక వేధింపులకు కూడా పాల్పడేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. హత్రాస్‌లోని పోలీసు సూపరింటెండెంట్ చిరంజీవ్ నాథ్ సిన్హా ప్రకారం, కుమార్ తన అత్యాచార వీడియోలను రికార్డ్ చేయడానికి తన కంప్యూటర్‌లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నాడని తెలిపారు. 65 కి పైగా వీడియోలు కొన్ని అశ్లీల వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేశాడని పోలీసులు తెలిపారు.
Also read : కర్నూల్‌లో కీచక టీచర్.. బాలికలకు బ్లూ ఫిల్మ్ చూపించి ఏం చేశాడంటే!