పోలీసులకు చుక్కలు చూపించాడు.. తప్పించుకుని ముప్పుతిప్పలు పెట్టిన ఖైదీ!

సత్తుపల్లిలో జైలు నుంచి పారిపోయిన ఓ ​ఖైదీ పోలీసులకు మూడు గంటల పాటు చుక్కలు చూపించాడు.చివరికి ఆంధ్రాలోని చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలో ఖైదీని అదుపులోకి తీసుకున్నారు. భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో అరెస్టైన నిందితుడు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.  

New Update
Khammam jail

జైలు నుంచి పారిపోయిన  ఓ అండర్ ట్రయల్ ​ఖైదీ పోలీసులకు మూడు గంటల పాటు చుక్కలు చూపించాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యపై హత్యాయత్నం చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పెండ్ర రమేశ్ మంగళవారం సత్తుపల్లిలోని సబ్  జైల్  గోడ దూకి పారిపోయాడు.  మంగళవారం ఉదయం 10 గంటలకు  జైలు వెనుక భాగం నుంచి నీలాద్రీ అర్బన్ పార్క్ అటవీప్రాంతంలోకి పారిపోయాడు.  

Also read :   రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు

Also read :  హైజాక్ నుంచి 104మందిని రక్షించిన పాక్ ఆర్మీ..16 మంది ఉగ్రవాదులు హతం

రెండు బృందాలుగా విడిపోయి

దీంతో వెంటనే  అప్రమత్తమైన జైళ్ల శాఖ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.  రెండు బృందాలుగా విడిపోయిన పోలీసులు ఖైదీకోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.  మూడు గంటలపాటు గాలించి ఆంధ్రాలోని చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలో రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.  సమాచారం తెలుసుకున్న తదనంతరం సత్తుపల్లి సబ్ జైలు ను పరిశీలించారు జైళ్ల శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు.  

Also read :   డెలివరీ కోసమని తీసుకెళ్తే చంపేశారు..  పాప పుట్టిందని చెప్పి..!

గోడలు దూకి పరార్

జైలు నుంచి ఖైదీ ఎలా తప్పించుకున్నాడన్న విషయంపై విచారణకు జైళ్ల శాఖను ఆదేశించారు.  నిందితుడు రమేష్ ముందుగా18 అడుగుల పొడవైన జైలు గోడలు దూకి పరారయ్యాడని ముందుగా ప్రచారం నడించింది. అయితే ఖైదీతో జైలు పరిసర ప్రాంతాలను సిబ్బంది శుభ్రం చేయిస్తుండగా పరారైనట్లు జైళ్లశాఖ అధికారులు వెల్లడించారు. రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో సబ్ జైల్ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. గతేడాది డిసెంబర్ 7న భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో అరెస్టైన రమేష్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.  

Also Read :   War 2: వార్2 రిలీజ్ వాయిదా?.. షూటింగ్ లో స్టార్ హీరోకి గాయాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు