/rtv/media/media_files/2025/02/13/jd24ijq28jiAgdMFzSNq.jpg)
ladies
అనాథాశ్రమానికి చందా ఇవ్వాలంటూ వచ్చిన ఓ ఇద్దరు అమ్మాయిలు వృద్ధురాలి మెడలోంచి ఏడు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్పల్లిలో చోటుచేసుకుంది. గజ్జెల్లి లక్ష్మి అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉంటోందని గమనించిన ఓ ఇద్దరు అమ్మాయిలు లక్ష్మి వద్దకు వచ్చి అనాథాశ్రమానికి చందా ఇవ్వాలని, వివరాలు నమోదు చేసుకునేందుకు వచ్చామంటూ ఆధార్ కార్డు చూపించాలని కోరారు.
ఈ క్రమంలో ఎవరూ లేని టైమ్ చూసి ఇంట్లోకి చొరబడి లక్ష్మి చేతులు, నోరు గట్టిగా పట్టుకొని ఆమె మెడలో ఉన్న ఏడు తులాల బంగారు గొలుసును లాక్కున్నారు. తర్వాత ఇంటి బయట గడియ పెట్టి పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత వృద్ధురాలి ఏడుపు విన్నచుట్టుపక్కల వాళ్లు గడియ తీసి విషయం తెలుసుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై నవీన్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సర్వే పేరుతో ఇంట్లోకి వచ్చి
ఇక మరో ఘటనలో సర్వే పేరుతో ఇంట్లోకి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఏకంగా రూ. 15లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో చోటుచేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం శీలం యుగంధర్ రెడ్డి అనే వ్యక్తి కొత్తగూడెంలోని పాలిటెక్నిక్ కాలేజీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య లలిత వైరాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచగా పనిచేస్తోంది. భార్యాభర్తలిద్దరూ డ్యూటీకి వెళ్లడంతో యుగంధర్ రెడ్డి తల్లి వెంకట్రావమ్మ ఇంటి దగ్గర ఉంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో సర్వే పేరుతో ఓ నలుగురు యుగంధర్ రెడ్డి ఇంటికి వచ్చారు. కొద్దీసేపు వివరాలు అడిగినట్టు చేసి ఎవరూ లేని టైమ్ చూసి వెంకట్రావమ్మపై దుప్పటితో ముసుగు వేసి విచక్షణారహితంగా కొట్టి ఆమె కాళ్లు చేతులు కట్టేసి డబ్బు, నగదుతో పరారయ్యారు.
Also Read : ఏం కొడుకువురా.. ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలు ఆపాడు!