ఐదుగురిని కిడ్నాప్ చేసి .. ముగ్గురు బాలికలపై 18 మంది అత్యాచారం .. నిందితులందరూ మైనర్లే !

జార్ఖండ్‌లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఐదుగురు మైనర్ బాలికలను కిడ్నాప్ చేసిన 18 మంది మైనర్ బాలురులు అందులో ముగ్గురిపై సామూహిక అత్యాచారం చేశారు. ఇందులో మిగిలిన ఇద్దరు బాలికలు వారి నుండి తప్పించుకోగలిగారు.

New Update
gang rape in Bengaluru

జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఐదుగురు మైనర్ బాలికలను కిడ్నాప్ చేసిన 18 మంది మైనర్ బాలురులు అందులో ముగ్గురిపై సామూహిక అత్యాచారం చేశారు. ఇందులో మిగిలిన ఇద్దరు బాలికలు వారి నుండి తప్పించుకోగలిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులందరినీ అరెస్టు చేశారు. 

ఈ సంఘటన ఫిబ్రవరి 21వ తేదీ శుక్రవారం అర్థరాత్రి జరిగిందని ఖుంటి ఎస్పీ అమన్ కుమార్ తెలిపారు. రానియా ప్రాంతంలో ఓ పెళ్లికి వెళ్లిన ఐదుగురు బాలికలు ఇంటికి తిరిగి వెళ్తుండగా.. కొంతమంది అబ్బాయిలు వారిని ఫాలో అయ్యారు.  నిర్జన ప్రదేశానికి వెళ్లాక అమ్మాయిలందరినీ కిడ్నాప్ చేశారు. వాళ్ళని బలవంతంగా కొండ మీదకు తీసుకెళ్తుండగా.. వారినుంచి ఇద్దరు బాలికలు  తప్పించుకని అక్కడి నుంచి పారిపోయారు.

ముగ్గురు బాలికలపై సామూహిక అత్యాచారం

అనంతరం18 మంది నిందితులు ముగ్గురు బాలికలపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం వారిని అక్కడే  వదిలేసి పారిపోయారు. అక్కడినుంచి వారు తమ ఇంటికి వెళ్లిపోయారు. ఐదుగురు బాలికలలో ముగ్గురి వయస్సు 12-16 సంవత్సరాలు కాగా, నిందితులైన అబ్బాయిల వయస్సు 12-17 సంవత్సరాల మధ్య ఉంటుందని చెబుతున్నారు. బాధితుల కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.  

బాధిత బాలికల ఫిర్యాదు ఆధారంగా నిందితులపై భారత శిక్షాస్మృతి, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా గత ఏడాది సెప్టెంబర్‌లో ఖుంటి జిల్లాలో ఒక గిరిజన మైనర్ బాలికను ఆరుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. పాఠశాల నుండి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో మాటు వేసిన   ఆరుగురు యువకులు బైక్ పై వెంబడించి బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. 

గత మూడేళ్లలో జిల్లాలో మొత్తం 16 గ్యాంగ్ రేప్ కేసులు నమోదయ్యాయి. 2022లో ఏడు, 2023లో ఐదు, 2024లో మూడు, 2025లో ఐదు గ్యాంగ్ రేప్ కేసులు జరిగాయి. ఖుంటి పోలీసులు ఈ కేసులను ఛేదించి, నిందితులపై చర్యలు తీసుకున్నారు, వీరిలో ఎక్కువ మంది మైనర్లు కావడం  గమనార్హం. 

Also read :  ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్‌ పదవికి జీవీ రెడ్డి రాజీనామా

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు.

author-image
By Krishna
New Update

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  అనూష అనే నిండు గర్భిణి తన భర్త జ్ఞానేశ్వర్‌ చేతిలో దారుణ హత్యకు గురి కాగా..  కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు. అక్కడికి చేరుకున్న అనూష బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రత్యక్షంగా భార్యను, పరోక్షంగా తల్లి కడుపులో బిడ్డను హత్య చేసిన నిందితుడు  జ్ఞానేశ్వర్‌ ను కఠినంగా శిక్షించాలని అనూష కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.  ఇలాంటి వాడిని ఉరిశిక్ష సరైనదని కోరుతున్నారు. కాగా నిందితుడు జ్ఞానేశ్వర్‌ను పీఎం పాలెం పోలీసులు భీమిలి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు.

Also read :   రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

ప్రేమించి పెళ్లి చేసుకుని 

గెద్దాడ జ్ఞానేశ్వర్, అనూష (27) 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మధురవాడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటున్నారు.  రెండు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు నడుపుతోన్న జ్ఞానేశ్వర్ తన భార్యకు అతని కుటుంబ సభ్యులను మాత్రం పరిచయం చేయలేదు.  అత్తమామల వద్దకు వెళ్దామని ఆమె ఎప్పుడు అడిగినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు.  ఓసారి తనకు క్యాన్సర్ ఉందని చెప్పి విడాకులు తీసుకుందామని నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటూ భార్యను మోసం చేయాలని అనుకున్నాడు. కానీ ఆమె నీతోనే జీవితమని తెగేసి చెప్పింది. దీంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని...   నిద్రలో ఉన్న భార్యను పీక నులిమి హత్య చేశాడు. ఆ తరువాత ఏమీ ఎరగనట్లు స్థానికులతో కలిసి కేజీహెచ్‌కు తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన పోలీసులు జ్ఞానేశ్వర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజం ఒప్పుకున్నాడు.  

Also read : ఇంకొద్ది రోజులకైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో సంచలనం!

Advertisment
Advertisment
Advertisment