/rtv/media/media_files/2025/03/14/cxOlQDwVhLnVD18Ow7wh.jpg)
గుజరాత్‌లో దొంగలు రెచ్చిపోయారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)లో దొంగతనానికి పాల్పడ్డారు. దొంగతనానికి వచ్చిన ఐదుగురు ఏటీఎం మిషన్ ను గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి రూ.18లక్షల విలువైన నగదును దోచుకున్నారు. బుధవారం తెల్లవారుజామున 2:25 గంటల ప్రాంతంలో జహంగీర్‌పురాలోని చిత్రాలి రో హౌస్ అనే హౌసింగ్ సొసైటీ ముందు ఉన్న ఏటీఎం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏటీఎం లోపలికి వచ్చిన ఐదుగురు ముందుగా సీసీటీవీ కెమెరాలను బ్లాక్ టేపులతో కవర్ చేసి గ్యాస్ కట్టర్‌ని ఉపయోగించి ఏటీఎం మిషన్ ను కట్ చేసి డబ్బుతో ఊడాయించారు. సూరత్ పోలీస్ డీసీపీ విజయ్ సింగ్ గుర్జార్ మీడియాతో మాట్లాడుతూ దొంగలు ఏటీఎం కింది భాగాన్ని కత్తిరించారని తెలిపారు. స్థానిక పోలీసు బృందం, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దొంగల కోసం వెతుకుతున్నారు.
హైదరాబాద్ లో కూడా
హైదరాబాద్ లో ఇటీవల దొంగలు రెచ్చిపోయారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిరాలలో ఎస్బీఐ ఏటీఎం మిషిన్ ను కట్ చేసి రూ. 30 లక్షలు దోచుకెళ్లారు. కారులో వచ్చిన నలుగురు దుండగులు గ్యాస్ కట్టర్ తో ఏటీఎంను కట్ చేసి అందులో ఉన్న రూ. 30లక్షల డబ్బుతో ఉడాయించారు. ఇదంతా కేవలం కేవలం నాలుగు నిమిషాల్లోనే జరిగింది. ముందుగా సీసీ కెమరాలకు స్ర్పేకొట్టి , ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేశారు. కట్టర్, ఇనుప రాడ్లతో ఏటీఎంను బద్దలు కొట్టారు. దొంగతనం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగలను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాగా, రెండు రోజుల క్రితం ఏటీఎంలో రూ.30 లక్షలు పెట్టినట్లు బ్యాంక్ మేనేజర్ వెల్లడించారు.
Also Read : ఒప్పందం పై పుతిన్ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్!