మరో ఘోరం.. ఇద్దరు బాలికలపై రెండు రోజులు ఐదుగురు యువకులు అత్యాచారం!

ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. హైదరాబాద్ ఐఎస్ సదన్‌లోని ఓ పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన వారికి ఆశ్రయం కల్పిస్తామని చెప్పి నాగరాజు, సాయిదీప్, రాజు, రోహిత్ దారుణం చేశారు. నిందుతులను అరెస్ట్ చేశారు.

New Update
Minor Girl Rape : తెలంగాణలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య

TG Crime : తెలంగాణలో మరో దారుణం జరిగింది. ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకులు రెండు రోజులపాటు లైంగిక దాడికి పాల్పడిన ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. బస్టాండ్ లో ఉన్న బాలికలకు ఆశ్రయం ఇస్తానని నమ్మించి ఒకరి తర్వాత ఒకరు దారుణంగా లైంగిక దాడి చేశారు. అనంతరం బాలికలను తమ చోటికి చేరుస్తామని నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతుండగా.. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పునరావాస కేంద్రం నుంచి పారిపోయి..

హైదరాబాద్ లోని సైదాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. జనగామకు చెందిన బాలిక(14) మూడు నెలల నుంచి, మల్కాజిగిరికి చెందిన బాలిక(15) సెప్టెంబరు 18 నుంచి ఐఎస్‌ సదన్‌ డివిజన్‌ పరిధిలో ఓ ప్రైవేటు సంస్థ పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నారు. ఇద్దరికీ తల్లిదండ్రులున్నా ఇతర సమస్యలతో వారిని పునరావాస కేంద్రంలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఇద్దరు బాలికల మధ్య స్నేహం మొదలైంది. కొద్ది రోజులకు అక్కడ ఉండలేక పారిపోవాలని ప్లాన్ చేశారు. సెప్టెంబరు 24న కిటికీ నుంచి దూకి వెళ్లిపోయారు. అదే రాత్రి 8 గంటల సమయానికి జనగామ బస్టాండ్ చేరుకున్నారు. అక్కడే పాన్‌షాప్‌ నిర్వాహిస్తున్న సాయిదీప్‌ దగ్గర ఫోన్‌ తీసుకుని నాగరాజు అనే యువకుడికి ఒక బాలిక ఫోన్‌ చేసింది. నాగరాజు వచ్చి ఆమెను తీసుకెళ్లగా ఇంకొక బాలిక అక్కడే ఉండిపోయింది. 

ఆశ్రయం కల్పిస్తామని దారుణం.. 

ఈ క్రమంలోనే మరో బాలికను గమనించిన పాన్ షాప్ యువకుడు సాయిదీప్‌.. ఆమెకు ఆశ్రయం కల్పిస్తానని బేకరీకి తీసుకెళ్లాడు. అక్క సాయిదీప్, మరోయువకుడు రాజు ఇద్దరు కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత రాత్రి తీసుకెళ్లిన బాలికను నాగరాజు సెప్టెంబరు 25న ఉదయం జనగామ బస్టాండులో వదిలేశాడు. అయితే వారిద్దరని మరోసారి గమనించిన సాయిదీప్, రాజు.. తమ ఫ్రెండ్స్ అఖిల్, రోహిత్‌ లకు సమాచారం ఇవ్వడంతో వారంతా కలిసి బాలికలను హైదరాబాద్‌ పునరావాస కేంద్రానికి తీసుకెళ్తామని నమ్మించారు. దీంతో కారు ఎక్కిన బాలికలను నిర్మాణుష్య ప్రాంతాల్లో తిప్పుతూ కారులోనే లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఇద్దరినీ బస్టాండ్ సమీపంలో వదిలివెళ్లగా.. పోలీసులు పట్టుకుని సైదాబాద్‌ పునరావాస కేంద్రానికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే బాలికలకు కౌన్సిలింగ్ ఇస్తుండగా.. లైంగిక దాడి జరిగినట్లు తెలిపారు. దీంతో వెంటనే ఐ ఐదుగురు యువకులను పట్టుకుని పోక్సో కేసు నమోదు రిమాండ్‌కు పంపించినట్లు తెలిపారు. 

Also Read :  ట్రోలింగ్ చేయిస్తున్నాడని.. హర్ష సాయిపై బాధితురాలు మరో ఫిర్యాదు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

యువతిపై దాడి.. నిందితుడు అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు

విజయనగరం జిల్లా శివారం గ్రామంలో అఖిల అనే యువతిపై దాడి చేసిన  నిందితుడు ఆదినారాయణను (21)ను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ వెల్లడించారు. 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించారు

New Update
a young women

a young women

విజయనగరం జిల్లా శివారం గ్రామంలో అఖిల అనే యువతిపై దాడి చేసిన  నిందితుడు ఆదినారాయణను (21)ను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ వెల్లడించారు. 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించారు. నిందితుడు దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అఖిల సోదరుడికి నిందితుడు ఆదినారాయణస్నేహితుడు. ఆమె కుటుంబ సభ్యులతోనూ ఆదినారాయణ సన్నిహితంగా ఉండేవాడు. 

Also read :  డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇద్దరి మధ్య వాగ్వాదం

అయితే ఇటీవల ఆమెకు అసభ్య సందేశాలు పంపడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే విషయమై అతడిని యువతి కుటుంబ సభ్యులు హెచ్చరించారు. దీంతో కక్ష పెంచుకున్న ఆదినారాయణ అఖిలపై కత్తితో దాడికి దిగాడు.  శనివారం ఇంటి ముందు బాధితురాలు బట్టలు ఉతుకుతున్న టైమ్ లో   కత్తితో పొడిచి పరారయ్యాడు. యువతికి పొట్టలో బలంగా కత్తిపోట్లు దిగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది.  

Also Read :  దేశానికి స్ఫూర్తినిచ్చిన పోరాటం..ఆ భూములపై కేటీఆర్ బహిరంగ లేఖ

వెంటనే చుట్టు పక్కల వారు గమనించి 108కి ఫోన్‌ చేశారు. ఆమెను చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయనగరంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్పృహలోకి రావడంతో  ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

Also Read : Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

Also read :  మరికొన్ని రోజుల్లో పెళ్లి... కాబోయే భర్త కళ్లముందే యువతి మృతి!

Advertisment
Advertisment
Advertisment