ప్రేమించాడు.. కానీ పెళ్లి ప్రస్తావన వచ్చే సరికి కులం పేరు తీసుకొచ్చి నిరాకరించాడు. దీంతో యువతి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హనుమాన్ బస్తీకి చెందిన జంగపల్లి సాయి స్నేహిత అనే యువతి, అదే ఏరియాకి చెందిన శ్రీనాథ్ కొన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇది కూడా చూడండి: హరీష్ రావుకు బిగ్ షాక్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ వారెంట్!? చున్నీతో ఉరేసుకుని.. ఈ క్రమంలో యువతి తనని పెళ్లి చేసుకోవాలని యువకుడిని కోరగా.. కులం పేరుతో నిరాకరించేవాడు. ఎన్నిసార్లు అడిగిన పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మనస్తాపం చెందిన ఆ యువతి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన చున్నీతో ఉరేసుకుని కొన ఊపిరితో ఉన్న ఆమెను వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఇది కూడా చూడండి: Ganja:ఈ చాక్లెట్లు తింటే సకల రోగాలు మటు మాయం.. తనిఖీల్లో సంచలన నిజాలు! సాయి స్నేహిత చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీనాథ్ పారిపోయాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇది కూడా చూడండి: YCP నాయకుడి దౌర్జన్యం..నగ్న వీడియోలతో బెదిరించి, 2 ఏళ్లు అత్యాచారం! ఇదిలా ఉండగా.. వరంగల్‌లో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే బ్యాంక్ ఉద్యోగిని కారులో హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. హన్మకొండ శ్రీనగర్ కాలనీకి చెందిన రాజా మోహన్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. గుర్తు తెలియని దుండగులు రాజాను తన కారులోనే హత్య చేశారు. కాళ్లు, చేతులకు తాళ్లు కట్టి అతన్ని హత్య చేశారు. ఇంతటితో ఆగకుండా ఇనుప గొలుసులతో తన కార్‌లోనే రాజా మోహను బంధించడంతో వరంగల్ ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తులకు అలర్ట్..భారీ వర్షాలతో క్లోజ్ అయిన పెద్ద పాదం మార్గం!