Actor Abhishek : డ్రగ్స్ కేసులో సినీనటుడు అభిషేక్ అరెస్ట్! డ్రగ్స్ కేసులో సినీనటుడు అభిషేక్ అరెస్ట్ అయ్యాడు. ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్ పీఎస్ లో డ్రగ్స్ కేసుల్లో నిందితుడుగా ఉన్న అభిషేక్ ను యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గోవాలో అరెస్ట్ చేసింది. కోర్టు కేసులకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. By srinivas 26 Sep 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Drugs Case : డ్రగ్స్ కేసులో సినీనటుడు అభిషేక్ అరెస్ట్ అయ్యాడు. ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్ పీఎస్ లో డ్రగ్స్ కేసుల్లో నిందితుడుగా ఉన్న అభిషేక్ ను యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. కోర్టు కేసులకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంనుంచి పారిపోయిన అభిషేక్ గోవాలో రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. అరెస్ట్ చేసి హైదరాబాద్ సీసీఎస్ కు తీసుకొచ్చారు. అనంతరం అభిషేక్ ను కోర్టు ముందు హాజరుపరచనున్నారు. అయితే 2012 డిసెంబర్ లో అభిషేక్ డ్రగ్స్ తో పట్టుబడగా పోలీసులు అరెస్టు చేశారు. జి. శ్రీనివాసులు అనే వ్యక్తితో స్కోడా కారులో ప్రయాణిస్తుండగా.. పోలీసుల తనిఖీల్లో 10 ప్యాకెట్ల కొకైన్ తో పట్టుబడ్డారు. అభిషేక్ తో పాటు నవీన్, శ్రీనివాస్ అలాగే మరో ఇద్దరు నైజీరియన్లతో పాటు మొత్తం ఆరుగురిని అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు దక్షిణ ఆఫ్రికా నుంచి ముంబైకి ఈ కొకైన్ తీసుకొచ్చి, అక్కడ నుంచి హైదరాబాదుకు తరలించి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. Also Read : భార్య బికినీ కోరిక.. రూ.418 కోట్లకు ఐలాండ్ కొనేసిన భర్త! #drugs-case #abhishek సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి