/rtv/media/media_files/jlV4TnFCWgC529hAcUH2.jpg)
తెలంగాణ బతుకమ్మ పండుగ వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. సద్దుల బతుకమ్మ వేడుకలకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గురువారం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కారు డాష్ క్యామ్ ఫుటేజ్.. బతుకమ్మ పండుగ వేడుకల్లో విషాదం
— Telugu Scribe (@TeluguScribe) October 11, 2024
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామంలో బతుకమ్మ వేడుకల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్లు తగిలి చీకటి యాకయ్య (45) అనే వ్యక్తి మృతి చెందాడు.
యాకయ్య చేతిలో చిన్నారి ఉండగా.. అదృష్టవశాత్తు చిన్నారి ప్రాణాలతో… pic.twitter.com/aDld7gAezm
వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన చీకటి యాక య్య(41) మనవడిని తీసుకోని సద్దుల బతుకమ్మ వేడుకలకు వెళుతుండగా ప్రమాదవశాత్తు సీరియల్ బల్బుల లైన్‌పై పడిపోవడం తో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దాంతో వెనకాలే వచ్చిన వ్యక్తులు అతడిని రక్షించే ప్రయత్నం చేయగా యాకయ్య మనుమడిని విడిచిపెట్టడంతో.. ఆయన మనవడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకున్న యాకయ్యను నెక్కొండలోని హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.