ప్రాణం తీసిన బెట్టింగ్.. రోజురోజుకీ పెరుగుతున్న కేసులు

ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిస అయ్యి ఆత్మహత్య చేసుకుంటున్న యువకుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. ఇటీవల ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం బెట్టింగ్‌ల వల్ల రూ.24 లక్షలు పోగొట్టుకోవడంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది.

New Update
అమెరికాలో నీట మునిగి ఇద్దరు తెలుగు చిన్నారులు మృతి

రోజురోజుకీ ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులు పెరుగుతున్నాయి. ఎంతో మంది యువకులు ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిస అయ్యి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇలానే ఓ సాఫ్ట్‌వేర్ యువకుడు బెట్టింగ్ యాప్‌ల వల్ల ఆత్మహత్య చేసుకున్న ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తంబళ్లపల్లె మండలంలోని దిగువగాలిగుట్టకు చెందిన పద్మనాభరెడ్డి బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.

ఇది కూడా చూడండి:  దేవర ఫేక్ కలెక్షన్లపై నిర్మాత క్లారిటీ.. ఫ్యాన్స్ ఆనందం కోసమే అలా..!

రైలు కింద పడి ఆత్మహత్య..

ఉద్యోగం చేస్తూ.. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు వేసి రూ.24 లక్షలు పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న బాధలో.. అమ్మమ్మ ఇంటికి వెళ్లడానికి బయలు దేరాడు. కానీ ఇంటికి వెళ్లకుండా మధ్యలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు చనిపోతున్నానో అని తెలుపుతూ.. ఓ లేఖ రాసి మధ్యలో రైలు కిందపడి చనిపోయాడు. స్థానికులు వెంటనే పోలీసులకు తెలియజేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతని ఆత్మహత్య లేఖ, గుర్తింపు కార్డు, ల్యాప్‌టాప్, ఫోన్‌ ఆధారంగా పద్మనాభరెడ్డిగా గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి, దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: USA: ఇజ్రాయెల్‌కు అమెరికా కీలక ఆయుధాలు

ఇంతకీ ఆ లేఖ‌లో ఏం రాశాడంటే.. ఆన్‌లైన్ బెట్టింగ్‌ ద్వారా దాదాపుగా రూ.24 లక్షలు పోగొట్టుకున్నా.. ఎవరూ కూడా దయచేసి బెట్టింగ్ జోలికి పోవద్దు. చాలా ప్రమాదకరమని తెలిపాడు. బెట్టింగ్ మాఫియా వాళ్ల ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు చెప్పిన కూడా పోలీసులు ఏం చేయలేకపోయారు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా.. నా చావుకు నేనే కారణమని గుడ్‌బై అంటూ లేఖ రాశాడు. ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబమంతా విషాదంలోకి వెళ్లిపోయింది. ఈ మధ్య కాలంలో యువకులు ఎక్కువగా ఈ బెట్టింగ్‌లకు అలవాటు పడి ప్రాణాలను తీసుకుంటున్నారు.

ఇది కూడా చూడండి: Ap: బంగాళాఖాతంలో అల్పపీడనం..4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

రేప్ కేసులో ట్విస్ట్.. అంతా ఆమె ఇష్టపూర్వకంగానే జరిగిందని నిందితుడికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు

అలహాబాద్ హైకోర్టు రేప్ కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. మద్యం సేవించిన యువతి ఇష్టపూర్వకంగానే నిందితుడితో శృంగారంలో పాల్గొందని తేలింది. తర్వాత అతనిపై ఫిర్యాదు చేసింది. సాక్ష్యాలు పరిశీలించిన హైకోర్టు నిందితుడికి బెయిల్ ఇచ్చింది.

New Update
alahabad high court

alahabad high court

అల‌హాబాద్ హైకోర్టు ఓ రేప్ కేసులో నిందితుడికి బెయిల్ మంజూరీ చేసింది. అత్యాచారానికి గురైన మ‌హిళే.. ఆ స‌మ‌స్యకు కార‌ణ‌మైంద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఆమె స‌మ‌స్యకు ఆమే బాధ్యురాలు అని కోర్టు పేర్కొన్నది. జ‌స్టిస్ సంజయ్ కుమార్ సింగ్ ఆ కేసులో తీర్పును వెలువ‌రించారు. 2024 సెప్టెంబ‌ర్‌లో ఢిల్లీలోని హౌజ్ ఖాస్ బార్‌లో ఓ మ‌హిళ‌కు ఓ వ్యక్తి ప‌రిచ‌యం అయ్యాడు. అయితే ఆ వ్యక్తే త‌న‌ను రేప్‌కు గురి చేసిన‌ట్లు ఆ మ‌హిళ ఫిర్యాదు చేసింది. డిసెంబ‌ర్ 2024లో నిందితుడిని అరెస్టు చేశారు. ఆ కేసులో ఇవాళ అల‌హాబాద్ హైకోర్టు తీర్పుఇచ్చింది. సదరు వ్యక్తి ఆమెను బలాత్కారం చేశాడని సాక్ష్యాలు ఏమీ లేవు. ఫిర్యాదు చేసిన యువతి ఇష్టపూర్వకంగానే అతనితో శ‌ృంగారం చేసిందని నిందితుడు తెలిపాడు. ఆరోజు ఆమె పూర్తిగా మధ్యం మత్తులో ఉందని తెలిపాడు. 

ముగ్గురు మ‌హిళా మిత్రుల‌తో క‌లిసి బార్‌కు వెళ్లిన యూనివ‌ర్సిటీ విద్యార్థిని అక్కడ ఫుల్‌గా తాగింది. మ‌త్తులో ఉన్న ఆమెకు ఓ వ్యక్తి ఆ ప‌బ్‌లో ప‌రిచ‌యం అయ్యాడు. ఆ వ్యక్తే ఈ కేసులో నిందితుడు. తెల్ల‌వారుజామున 3 గంట‌ల వ‌ర‌కు బార్‌లో ఉన్న ఆ వ్యక్తి.. ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. రెస్ట్ తీసుకునేందుకు అత‌ని ఇంటికి వెళ్లినట్లు ఆ మ‌హిళ త‌న ఫిర్యాదులో తెలిపింది. అయితే ఆ వ్యక్తి త‌నను అస‌భ్యక‌రంగా ట‌చ్ చేశాడ‌ని, త‌న ఇంటికి బ‌దులుగా బంధువుల ఇంటికి తీసుకెళ్లి రేప్ చేసిన‌ట్లు ఆమె ఆరోపించింది. నోయిడా పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

Also read: రూ.63కోట్ల స్కామ్ బయటపెట్టిన ఈడీ.. బ్యాంక్ మాజీ చైర్మెన్ అరెస్ట్

బెయిల్ పిటీష‌న్‌లో నిందితుడు ఆ రోజు జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను వివ‌రించారు. ఫుల్‌గా తాగిన ఆ మ‌హిళ‌కు స‌పోర్ట్ అవ‌స‌ర‌మైన నేప‌థ్యంలో ఆమెను ఇంటికి తీసుకెళ్లిన‌ట్లు అత‌ను చెప్పాడు. బంధువుల ఇంటికి ఆమెను తీసుకెళ్లిన‌ట్లు చేసిన ఆరోప‌ణ‌ల‌ను అత‌ను కొట్టివేశాడు. తానేమీ రేప్‌కు పాల్ప‌డ‌లేద‌ని, కానీ ఇరువురం ఇష్ట‌పూర్వ‌కంగా శృంగారంలో పాల్గొన్నట్లు చెప్పాడు. కోర్టు ఈ కేసులో తీర్పునిస్తూ.. బాధితురాలు ఓ పీజీ విద్యార్థి అని, ఆమె చ‌ర్యల‌పై ఆమెకు అవ‌గాహ‌న ఉంటుంద‌ని తెలిపింది. కేసు పూర్వోప‌రాలు, ప‌రిస్థితులు, సాక్ష్యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని తీర్పును ఇస్తున్నట్లు జ‌స్టిస్ పేర్కొన్నారు. పిటీష‌న‌ర్ బెయిల్‌కు అర్హుడ‌ని, అందుకే అత‌ని బెయిల్ పిటీష‌న్‌ను ఆమోదిస్తున్నట్లు జ‌స్టిస్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. 

Aslo read: కంచ గచ్చిబౌలి భూవివాదం సెంట్రల్ కమిటీ హైదరాబాద్‌లో వారితో భేటి

Advertisment
Advertisment
Advertisment