శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో.. కలకలం సృష్టిస్తున్న బాంబు బెదిరింపులు

హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజివ్ గాంధీ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్ నుంచి బ్యాంకాకు వెళ్లే విమానం గేట్ దగ్గర ఓ ప్రయాణికుడు బాంబు ఉందని అరవడంతో అతన్ని అదుపులోకి తీసుకుని, అధికారులు అలర్ట్ అయ్యారు.

New Update
Flight 3

విమాన బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్ నుంచి బ్యాంకాకు వెళ్లే విమానం గేట్ దగ్గర ఓ ప్రయాణికుడు బాంబు ఉందని గట్టిగా అరిచాడు. దీంతో వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని లగేజీని పరిశీలిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: అయ్యప్ప దర్శనాలకు పోటెత్తిన భక్తులు..తొలిరోజే ఎంతమందంటే? 

136 మంది ప్రయాణికులతో..

హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఈ విమానంలో మొత్తం 136 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే అందరూ ఆందోళన చెందారు. బాంబు బెదిరింపులతో అలర్ట్ అయిన అధికారులు వెంటనే విమానంలో తనిఖీలు నిర్వహించారు. ఈ మధ్య కాలంలో ఈ బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. గత కొన్ని రోజుల నుంచి వందలాది ఫ్లైట్‌లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. 

ఇది కూడా చూడండి: మెడికల్ కాలేజ్‌లో అగ్ని ప్రమాదం..10 మంది చిన్నారులు సజీవదహనం

ఈ బెదిరింపుల కారణంగా ఫ్లైట్ ఏజెన్సీలు విపరీతమైన నష్టాన్ని చవిచూస్తున్నాయి. దానికి తోడు విమానాలు ఆలస్యం అవడం, కొన్ని క్యాన్సిల్ కూడా అవుతున్నాయి.  దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇలా బెదిరింపులకు పాల్పడే వారిని ‘‘నో ఫ్లై’’ లిస్టులో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రూల్స్ ఉల్లంఘిస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఇది కూడా చూడండి: రీల్స్ చేస్తే జైలుకే..రైల్వే బోర్డు సీరియస్ డెసిషన్

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరిస్తే థర్డ్ పార్టీ కంటెంట్‌ను ఆయా ప్లాట్‌ఫామ్‌లు తీసుకునే వెసులుబాటు నిలిపివేస్తామని స్పష్టం చేసింది. ఇటీవల వివిధ ఎయిర్‌లైన్స్‌కు బాంబు బెదిరింపు ఫోన్‌కాల్స్ రావడం వల్ల పలు విమాన సర్వీసులు కూడా ఆలస్యమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది. 

ఇది కూడా చూడండి: చివరి మ్యాచ్‌లో గెలుపు..3–1తో సీరీస్ కైవసం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

అమెరికా నుంచి ఫ్యామిలీ ట్రిప్.. మరో మృతుడు కుటుంబం కన్నీటి గాథ

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన బితాన్‌ మృతి చెందాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్న బితాన్ ఇటీవల సొంతూరు వచ్చి వెకేషన్‌కి భార్య, కొడుకుతో వెళ్లారు. ఈ క్రమంలో ఉగ్రదాడికి బలైయ్యాడు. కుమారుడు, భార్య ప్రాణాలతో బయటపడ్డారు.

New Update
west bengal software dead

west bengal software dead

జమ్మూకశ్మీర్‌ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో దేశ వ్యాప్తంగా భయాందోళన మొదలైంది. కశ్మీర్ టూర్‌కి వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. 28 మంది పర్యాటకులను టీఆర్‌ఎఫ్‌ ఉగ్రవాదుల కాల్చి చంపారు. వీరిలో చాలా మంది మృతి చెందారు. కొత్త పెళ్లయిన వారిని కూడా దారుణం కాల్చి చంపేశారు. ఓ లెఫ్టినెంట్ నేవీ అధికారి వినయర్‌ నర్వాల్ (26) ఆరు రోజుల కిందటే పెళ్లి జరిగింది. హనీమూన్‌కి వెళ్లగా ఉగ్రవాదులు కాల్చి చంపారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

భార్య, కుమారుడిని వదిలేసి..

వీరే కాకుండా మరో ఫ్యామిలీ కూడా ఈ ఉగ్రదాడికి బలైంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బితాన్‌ అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్నాడు. అక్కడ టీసీఎస్‌లో పనిచేస్తున్న బితాన్ సొంతూరు అయిన పశ్చిమ బెంగాల్‌కి ఇటీవల వచ్చారు. ఈ క్రమంలో భార్య, కొడుకుతో కలిసి వెకేషన్ కోసం కశ్మీర్ వెళ్లగా.. ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడిలో భార్య పిల్లలను వదిలేసి.. బితాన్‌ను చంపేశారు. భర్త చనిపోవడంతో భార్య కన్నీరుమున్నీరు అవుతుంది. అతని కుటుంబ సభ్యులు కూడా రోధిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

అలాగే ఓ లెఫ్టినెంట్ నేవీ అధికారి వినయర్‌ నర్వాల్ (26) ఆరు రోజుల కిందటే పెళ్లి జరిగింది. హనీమూన్‌కి వెళ్లగా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఏప్రిల్ 16న ఆయనకు వివాహం జరిగింది. హనీమూన్‌ కోసం ఆయన తన సతీమణితో కశ్మీర్‌కు వచ్చారు. పెళ్లై కనీసం వారం రోజులు కూడా గడవకముందే వినయ్ జీవితం ఉగ్రవాదులకు బలైపోయింది.

ఇది కూడా చూడండి: J&K TerrorAttack:ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!

భర్తను కోల్పోయిన ఆ నవవధువ ఆవేదన అందరినీ కన్నీ్ళ్లు పెట్టిస్తోంది. ఆమె రోదిస్తూ.. '' మాకు పెళ్లయి ఆరు రోజులే అయ్యింది. ఈ ఘటన జరిగినప్పడు మేము పానీపూరీ తింటున్నాం. ఒక్కసారిగా ఓ ఉగ్రవాది మా వద్దకు వచ్చాడు. నీ భర్త ముస్లిం కాదు కదా అని అడిగాడు. వెంటనే తన తలకు తుపాకీ గురిపెట్టి కాల్చి వెళ్లిపోయాడని'' ఆమె ఏడుస్తూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Advertisment
Advertisment
Advertisment