Karimnagar : కరీంనగర్ లో ఘోరం: నుజ్జునుజ్జయిన కారు.. ఇద్దరు యువకులు బలి!

కరీంనగర్ బైపాస్ రోడ్డుపై గురువారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

New Update
road accident

కరీంనగర్ బైపాస్ రోడ్డుపై గురువారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

సీఐ ప్రదీప్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్-పెద్దపల్లి బైపాస్ మార్గంలోని బొమ్మకల్ ఫ్లైఓవర్ సమీపంలో ఈ విషాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ లారీని, అటుగా వస్తున్న కారు పక్క నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయిపోయింది.

ప్రస్తుతం విషమంగా

ప్రమాద సమయంలో కారులో నలుగురు యువకులు ఉన్నారు. వీరిలో సయ్యద్ అబ్దుల్ రహమాన్ (19), సయ్యద్ ఆతియాబ్ హుస్సేన్ (21) తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించారు. మరో యువకుడు ఎండీ అదునాన్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. నాలుగో వ్యక్తి ఎండీ అబ్రార్, ప్రమాదాన్ని ముందే ఊహించి కారులో నుంచి బయటకు దూకేయడంతో స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయిన యువకులను చూసి వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు