పాస్టర్ ప్రవీణ్ కేసులో మిస్టరీలు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. చనిపోయే కొన్ని గంట ముందు ట్రాఫిక్ ఎస్సై సుబ్బారావుతో మాట్లాడారు. బైక్ నడుపుకుంటూ వచ్చిన ప్రవీణ్ గురించి ఎస్సై సుబ్బారావు షాకింగ్ నిజాలు బయటపెట్టారు. మార్చి 24 సాయంత్రం 5 గంటలకు ప్రవీణ్ విజయవాడ చేరుకున్నట్లు ఎస్సై చెప్పారు. సాయంత్రం 5.20 గంటలకు రామవరప్పాడు VMC పార్క్ దగ్గర ప్రవీణ్ పడిపోయాడు. అదే సమయంలో సుబ్బారావు ఆయన్ని చూసి మాట్లాడారు. ప్రవీణ్ తనకు తానే కింద పడిపోయాడని ఎస్సై సుబ్బారావు పోలీసులకు తెలిపారు.
Also read: Temperature: ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఇండియాలో దబిడి దిబిడే.. IMD వార్నింగ్
దెబ్బలు తగిలాయా, హాస్పిటల్‌కు వెళ్దామా అని ఎస్సై సుబ్బారావు ప్రవీణ్‌ను అడిగా-రు. -ప్రవీణ్‌కు హెల్మెట్, మాస్క్ ఉందని, కళ్లజోడు ఒక అద్దం ఊడిపోయిందని ఎస్సై సుబ్బారావు చెబుతున్నారు. సా.5గం. నుంచి 8 గం. వరకు VMC పార్క్ దగ్గరే పాస్టర్ ప్రవీణ్ కూర్చొని ప్రవీణ్ నిద్రపోయాడని ఎస్సై సుబ్బారావు చెప్పారు. ఆ సమయంలో అతను చాలా నీరసంగా ఉన్నాడని ఆయన చెప్పారు. 8 గం.కు ట్రాఫిక్ ఎస్సై సుబ్బారావే వాటర్, టీ ఇప్పించని చెప్పారు. హైదరాబాద్ నుంచి వస్తున్నానని, రాజమండ్రి వెళ్లాలి ప్రవీణ్ ఎస్సైకి చెప్పాడు. నువ్వు వెళ్లే పరిస్థితిలో లేవు, నీ బైక్‌కు ఏం కాదని, లాడ్జీలో పడుకుని ఉదయం వెళ్లమని ఎస్సై సుబ్బారావు ప్రవీణ్‌కు చెప్పాడు. తర్వాత కొంత సమయానికి ఆయనకు చెప్పకుండానే ప్రవీణ్ వెళ్లిపోయాడని ఎస్సై సుబ్బారావు చెప్పాడు. కిందపడ్డ టైంలో ప్రవీణ్‌కు హెల్మెట్, మాస్క్ ఉందన్నారు. ప్రవీణ్ ఫోటోలు ట్రాఫిక్ సిబ్బంది తీసుంటారని, సీసీ ఫుటేజీ కూడా రికార్డ్ అయి ఉంటుందని ఎస్సై సుబ్బారావు వివరించారు.
Also read: BREAKING: HCU భూముల అమ్మకంపై యూనివర్సిటీ కీలక ప్రకటన