20 రూపాయల పెట్రోల్ కోసం గొడవ.. యువకులకు పోలీస్ స్టేషన్‌లో శిరోముండనం 20 రూపాయల పెట్రోల్ కోసం బంక్ నిర్వాహకులతో గొడవపెట్టుకున్న ముగ్గురు యువకులకు పోలీసులు శిరోముండనం చేయించిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా లింగాలలో జరిగింది. దీంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. By srinivas 19 Oct 2024 | నవీకరించబడింది పై 19 Oct 2024 11:11 IST in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి TG News: ఇరవై రూపాయల పెట్రోల్ కోసం పెట్రోల్ బంకులో గొడవపడినందుకు యువకులకు పోలీసులు టార్చర్ చూపించారు. అంతేకాదు తాము ఏ తప్పు చేయలేదని చెబుతున్న వినకుండా పోలీస్ స్టేషన్ లో రాత్రంతా శిరోముండనం చేయించిన ఘటన తెలంగాణలో సంచలనం రేపింది. దీంతో అవమానంగా భావించిన ఓ యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడగా అసలు విషయం బయటపడింది. ఈ మేరకు నాగర్‌కర్నూల్ జిల్లా లింగాలలో ఈ ఘటన చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి. ఇది కూడా చదవండి: సైబర్ స్కామ్.. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో మహిళ బట్టలు విప్పించి..! పెట్రోల్ పోసేందుకు తిరస్కరించడంతో.. లింగాల స్థానికుల సమాచారం ప్రకారం ముగ్గురు యువకులు ఆదివారం రాత్రి లింగాలలోని ఓ పెట్రోల్ బంకుకు రూ.20కు పెట్రోల్ కోసం వెళ్లారు. అయితే పెట్రోల్ పోసేందుకు నిర్వాహకులు తిరస్కరించడంతో ఇరువురి మధ్య వివాదం మొదలైంది. వెంటనే బంకు నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ ముగ్గురు యువకులను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు పోలీసులు. ఈ క్రమంలోనే పోలీసుస్టేషన్‌లో ఓ యువకుడు తల దువ్వకోవడం పోలీసులకు ఆగ్రహం తెప్పించింది. ఇది కూడా చదవండి: TN: హిందీని రుద్దకండి..మళ్ళీ రాజుకున్న వివాదం..మోదీకి స్టాలిన్ లేఖ ముగ్గురికి శిరోముండనం.. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఊగిపోయిన ఎస్సై.. ముగ్గురికి శిరోముండనం చేయించారు. దీంతో ఓ యువకుడు మనస్తాపంతో శుక్రవారం ఇంట్లోనే ఉరేసుకున్నాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అయితే యువకుల మధ్య గొడవతో మనస్తాపం చెంది తమ బిడ్డ ఆత్మహత్యకు చేసుకునేందుకు ప్రయత్నించాడని బాధితుడి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: సిన్వర్ చనిపోయే ముందు డ్రోన్ ఫొటేజ్.. వైరల్ అవుతున్న వీడియో ఈ గొడవపై స్పందించిన నాగర్‌కర్నూల్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్.. యువకుల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం అందినట్లు చెప్పారు. లింగాల ఎస్సై నాలుగు రోజుల నుంచి సెలవులో ఉన్నారని, శిరోముండనం జరిగినట్లు రుజువైతే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది కూడా చదవండి: వివాదంలో ఇరక్కున్న సీఎం కుమారుడు.. ఏం చేశాడంటే ? #police #nagarkurnool మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి