షాద్నగర్లో దారుణం.. ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే గొంతు కోశాడు!

షాద్నగర్లో దారుణం జరిగింది.  పోలీస్ స్టేషన్‌లో ప్రేమజంటపై హత్యాయత్నం చేశాడో దుండగుడు.  పోలీసులు చూస్తుండగానే బ్లేడుతో గొంతు కోశాడు. పోలీస్ స్టేషన్లోనే తమకు రక్షణ లేకపోతే ఇక బయట తమ పరిస్థితి ఎలా ఉంటుందంటూ ప్రేమికులు వాపోతున్నారు.  

New Update
attack shadnagar

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో దారుణం జరిగింది.  పోలీస్ స్టేషన్‌లో ప్రేమజంటపై హత్యాయత్నం చేశాడో దుండగుడు.  పోలీసులు చూస్తుండగానే బ్లేడుతో గొంతు కోశాడు. వివరాల్లోకి వెళ్తే నాని, నందిని కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని తెలిసి బయటకు వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో వారిపై మిస్సింగ్ కేసు నమోదైంది. దీంతో మిస్సింగ్ కేసు క్లోజ్ చేసుకోవడంతో పాటుగా అయితే తమకు రక్షణ కలిపించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది జంట.

Also read :  పెళ్లి చేసుకోకుండా శ్మశానవాటికలోనే.. ఈమెకు బతుకున్న మనుషులంటే భయమట!

Also Read :  గురుమూర్తి కేసులో బిగ్ ట్విస్ట్.. DNA టెస్టులో బయటపడిన సంచలనాలు!

అందరూ చూస్తుండగానే హత్యాయత్నం

అయితే  పోలీస్ స్టేషన్‌లోనే  అందరూ చూస్తుండగానే నానిపై నందిని బంధువుల హత్యాయత్నం చేశారు. పోలీస్ స్టేషన్ రిసెప్షన్లోనే  నాని గొంతు కోశాడు అమ్మాయి తరపు బంధువు రాజేష్ . వెంటనే నానిని గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించి ఇంటికి పంపించారు పోలీసులు. పోలీస్ స్టేషన్లోనే తమకు రక్షణ లేకపోతే ఇక బయట తమ పరిస్థితి ఎలా ఉంటుందంటూ ప్రేమికులు వాపోతున్నారు.  రాజేష్ పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు పోలీసులు.  

Also read :  లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం.. ఎంతకు కొన్నాడు..? ఆ దేశం ప్రత్యేకత ఏంటో తెలుసా?

Also Read :   మగాళ్లను మర్డర్ చేసే అవకాశం ఇవ్వండి.. రాష్ట్రపతికి మహిళా నేత సంచలన లేఖ!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు