ముంబైలో వరుస తొక్కిసలాటలు.. ఒకేసారి 22 మంది మృతి! ముంబాయిలోని ఎల్ఫినోస్టోర్ రైల్వే స్టేషన్‌లో 2017లో జరిగిన తొక్కిసలాటలో దాదాపుగా 22 మంది మరణించారు. వర్షం కారణంగా ఫుట్‌వేర్ బ్రిడ్జ్‌పై జనం గూమిగూడి.. అది కూలిపోతుందనే ప్రచారంతో తొక్కిసలాట జరిగింది. మళ్లీ ఏడేళ్ల తర్వాత ఇలాంటి తరహా తొక్కిసలాట జరగడం గమనర్హం. By Kusuma 27 Oct 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి ముంబై రైల్వే స్టేషన్‌లో వరుసగా తొక్కిసలాటలు జరుగుతుంటాయి. ఈరోజు బాంద్రా రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 9 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీపావళి పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే క్రమంలో ఈ దారుణ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఏడేళ్ల క్రితం ఇలాంటి ఘటనే ముంబైలో జరిగింది. పశ్చిమ రైల్వేలోని ఎల్ఫినోస్టోన్ రైల్వే స్టేషన్‌లో 2017 సెప్టెంబర్ నెలలో ఒక తొక్కిసలాట జరిగింది. ఈ దారుణ ఘటనలో 22 మంది మరణించగా, 40 మందికి పైగా గాయపడ్డారు. ఇది కూడా చూడండి: ఉదయం లేచిన వెంటనే తలనొప్పి వస్తోందా? అయితే తస్మాత్ జాగ్రత్త! ఏడేళ్ల క్రితం తొక్కసలాట ఘటనలో.. పశ్చిమ రైల్వేలోని ఎల్ఫిన్‌స్టోన్ రోడ్ సెంట్రల్ రైల్వేలోని పరేల్‌ను కలిపే ఫుట్ ఓవర్‌బ్రిడ్జిపై వర్షం పడుతున్న సమయంలో తోపులాట జరిగింది. వర్షానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌పై భారీగా జనం గుమిగుడారు. జనం ఎక్కువ కావడంతో బ్రిడ్జ్ రెయిలింగ్‌ను తాకడంతో కాంక్రీటు పడింది. దీంతో ఆ బ్రిడ్జ్ కూలిపోతుందని ప్రచారం జరగడంతో అందరూ ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట జరిగి 22 మంది మరణించారు. ఇందులో 14 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నారు. ఇది కూడా చూడండి: యంగ్ హీరోయిన్లను డామినేట్ చేసేలా.. అందంతో మెప్పిస్తున్న బ్యూటీ ఏడేళ్ల తర్వాత మళ్లీ ముంబైలో ఇలాంటి రైల్వే ఘటన జరగడం గమనర్హం. ఈ రోజు జరిగిన దారుణ ఘటనలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఏడుగురి పరిస్థితి నిలకడగా ఉండగా, మరో ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు జరిగిన తొక్కిసలాటతో ఏడేళ్ల క్రితం ఎల్ఫిన్‌స్టోన్‌లో జరిగిన దారుణ ఘటన మళ్లీ తెరపైకి వచ్చింది. ఇది కూడా చూడండి: ఇరాన్‌పై ప్రతీకార దాడులు.. విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ దీపావళి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లడానికి ప్రయాణికులు పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్‌కి చేరుకున్నారు. పండుగ దగ్గరగా వస్తుండం వల్ల ఇంటికి వెళ్లే వారి సంఖ్య పెరగడంతో స్టేషన్ రద్దీగా మారింది. బాంద్రా నుంచి గోరఖ్‌పూర్ బయలు దేరే ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫారమ్ నంబర్ 1లో ఉంది. ఉదయం 5.56 గంటల సమయంలో ట్రైన్ ఎక్కుతున్న సమయంలో ఈ దారుణ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇది కూడా చూడండి: పండగ వేళ సామాన్యులకు షాక్.. పెరిగిన ధరలు #mumbai మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి