పేరుకే ఎంబీఏ.. కానీ దొంగతనంలో పీహెచ్‌డీ

మహ్మద్ అవేజ్ అహ్మద్ ప్రముఖ కళాశాలలో ఎంబీఏ చదువుకున్న జల్సాలకు బాగా అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇప్పటి వరకు అతనిపై వందకి పైగా కేసులు ఉన్నా.. ఎన్నిసార్లు జైలుకి వెళ్లి వచ్చిన మాత్రం మారడంలేదు.

New Update
Andhra Pradesh : కేబుల్ ఆపరేటర్‌ ఘాతుకం.. వృద్ధురాలి ఇంట్లో చొరబడి..

చదువుకున్నది ఎంబీఏ .. కానీ దొంగతనంలో మాత్రమే పీహెచ్‌డీ చేశాడు. హైదరాబాద్‌లోని మలక్‌పేటలోని సైదాబాద్ ఇంద్రప్రస్థ కాలనీకి చెందిన మహ్మద్ అవేజ్ అహ్మద్ ఎంబీఏ చదివాడు. తండ్రి వైద్యశాఖలో ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు. కాలేజీలో చదువుకున్నప్పటి నుంచే బాగా జల్సాలకు అలవాటు పడ్డాడు. దీంతో అప్పటి నుంచే దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. వందకి పైగా దొంగతనాలు చేసిన కేసులు అతని మీద ఉన్నాయి.

బండి నంబర్ ప్లేట్లు మారుస్తూ..

బండి నంబరు ప్లేట్లు, ఒంటిపై చొక్కాలు మార్చి పోలీసులకు దొరక్కుండా తిరుగుతాడు. ఇటీవల జైలు నుంచి వచ్చిన మహ్మద్ ఓ ఇంటిలో విలువైన వస్తువులు చోరీ చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా విషయం బయటకు వచ్చింది. ఇతనికి భార్యలు, పిల్లలు కూడా ఉన్నారు. మొదటి భార్యకు సంతానం లేకపోతే రెండో వివాహం చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా ఏ విధంగా మారలేదు. గతంలో పోలీసులు ఇతనిపై పీడీ యాక్ట్‌ కూడా ప్రయోగించారు. 

ఇది కూడా చూడండి:  Lebanan: లెబనాన్‌లోని ఐరాస కార్యాలయం పై దాడి..ఖండించిన భారత్‌!

మహ్మద్‌కి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చినా, జైలుకు వెళ్లిన అతను మారలేదు. ఓ కేసులో అరెస్టై జైలుకెళ్లిన మహ్మద్ ఇటీవల బయటకు వచ్చాడు. ఏ మాత్రం మారకుండా తన స్నేహితుడు సలామ్‌ బిన్‌తో కలిసి కొండాపూర్, టోలిచౌకి, లంగర్‌హౌస్, కార్ఖానా ప్రాంతాల్లో దొంగతనానికి పాల్పడటంతో ఈ విషయం బయటకు వచ్చింది. సీసీ కెమెరా ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు. తన స్నేహితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Ap Rains:ఏపీకి మరో వాన గండం.. ఈ జిల్లాల్లో పిడుగులు, అతి భారీ వర్షాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు