/rtv/media/media_files/8dDoqF8e8Lu30e7V8ohH.jpg)
Medak Crime
Medak Crime : ఊళ్ళో మంత్రాలు చేస్తుందనే భయంతో ఓ మహిళను ఇంట్లోనే సజీవదహనం చేశారు గ్రామస్థులు. ఈ దారుణమైన ఘటన మెదక్ జిల్లా రాయంపేట మండలం కాట్రియాలలో చోటు చేసుకుంది.
Also Read: Iphone Murder: ఎంతకు తెగించార్రా.. ఐఫోన్ కోసం అలా చంపేస్తారా?
పోలీసుల కథనం ప్రకారం
రాయంపేట మండలం కాట్రియాలలో ద్యాగల ముత్తవ్వ అనే మహిళా నివాసం ఉంటుంది. అయితే ఈమె ఊళ్ళో మంత్రాలు చేస్తుందని భయపడిన గ్రామస్థులు .. గురువారం రాత్రి ఆమె పై దాడి చేశారు. ఇంట్లోనే ఆమె పై పెట్రోల్ పోసి నిప్పటించారు. దీంతో బాధితురాలు కేకలు వేయడంతో ఆమె అరుపులు విన్న కొందరు స్థానికులు ముత్తవ్వను రక్షించే ప్రయత్నం చేశారు. వెంటనే చికిత్స నిమ్మిత్తం హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే ఆమె మృతి చెందింది. దాడి భయంతో మృతురాలి కొడుకు, కోడలు ఇంట్లో నుంచి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నింధితులను అదుపులోకి తీసుకున్నారు.
Also Read: మాల్ ఓపెనింగ్ లో అపశృతి.. హీరోయిన్, ఎమ్మెల్యే యశస్విని అత్తకు గాయాలు!