ప్రియుడి కోసం లండన్ నుంచి హైదరాబాద్‌కు.. తర్వాత ఏమైందంటే? ట్యాక్సీ డ్రైవర్ అయిన ప్రియుడి మాయలో పడి వివాహిత లండన్ నుంచి హైదరాబాద్‌కి వచ్చింది. ప్రియుడి పుట్టిన రోజు వేడుకల కోసం భర్త లేని సమయంలో హైదరాబాద్ వచ్చేసింది. తల్లి ఇంట్లో లేదని పిల్లలు తండ్రికి చెప్పారు. అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. By Kusuma 09 Oct 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి ప్రియుడి మాటలను నమ్మి.. భర్త, పిల్లలను వదిలి లండన్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్‌కు చెందిన ఓ జంట ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో మహిళ తల్లి చనిపోవడంతో ఆస్తికల కలపడాని కోసం హైదరాబాద్ వచ్చి, ట్యాక్సీ అద్దె తీసుకుని తిరిగింది. ఇది కూడా చూడండి: ఇజ్రాయెల్ పై భారీ దాడులు.. వరుస రాకెట్లు ప్రయోగించిన హెజ్బుల్లా పిల్లలను, భర్తను వదిలేసి.. ఆన్లైన్లో డబ్బులు చెల్లించగా.. ట్యాక్సీ డ్రైవర్ ఆమెకు మెసేజ్‌లు చేయడం మొదలుపెట్టాడు. అతను చెప్పిన మాయమాటలను నమ్మిన వివాహిత.. భర్త లేని సమయంలో పిల్లలను వదిలేసి హైదరాబాద్‌కి బయలు దేరింది. భర్త తల్లి మృతి చెందడంతో అతను ఒంటరిగానే హైదరాబాద్ వెళ్లాడు. దీంతో భర్తకు తెలియకుండా ప్రియుడి జన్మదిన వేడుకల కోసం ఆమె కూడా హైదరాబాద్‌కి వెళ్లింది. ఇది కూడా చూడండి: మెషీన్ లెర్నింగ్ ఆవిష్కరణలకు.. భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ ఇంట్లో అమ్మ లేదని పిల్లలు తండ్రికి చెప్పగా.. హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. తనకి కాల్ చేయగా.. ట్యా్క్సీ డ్రైవర్ కిడ్నాప్ చేశాడని భర్తకు చెప్పింది. కానీ సరిగ్గా సమాచారం ఇవ్వకపోవడంతో అనుమానంతో స్నేహితుల సహాయంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విషయం బయట పడింది. లోకేషన్ ఆధారంగా ఆమెను పట్టుకుని పోలీసులు లండన్‌కు పంపించారు. ట్యాక్సీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది కూడా చూడండి: మూలా నక్షత్రంలో సరస్వతి దేవీ అవతారంలో అమ్మవారు.. పోటెత్తిన భక్తులు #crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి