బతకాలంటే బహిరంగ క్షమాపణ.. లేదంటే రూ.5 కోట్లు.. సల్మాన్‌కు వార్నింగ్

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ మరో వార్నింగ్ ఇచ్చింది. 'నీవు బతికి ఉండాలంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదా రూ.5 కోట్లు ఇవ్వాలి. లేదంటే లేపేస్తాం. మా గ్యాంగ్‌ యాక్టివ్ గా ఉంది' అని మెసేజ్ పంపినట్లు ముంబై పోలీసులు తెలిపారు. 

author-image
By srinivas
New Update
Salman Khan

Bishnoi Gang: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ మరో వార్నింగ్ ఇచ్చింది. సల్మాన్ బతకాలంటే ఈ రెండు షరతుల్లో ఒకదానిని అంగీకరించాలంటూ దుండగులు అప్షన్స్ ఇస్తూ మెసేజ్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆమె వీడియో చూడగానే ఏడ్చేసిన సూర్య.. ప్రోమో వైరల్

అలా జరగకపోతే చంపేస్తాం..

 ఈ మేరకు ముంబై ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌ వాట్సప్‌ నంబరుకు సోమవారం అర్ధరాత్రి మెసేజ్‌ వచ్చినట్లు వెల్లడిస్తూ.. ‘నేను లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడిని. సల్మాన్‌ఖాన్‌ బతికి ఉండాలంటే బహిరం క్షమాపణలు చెప్పాలి. లేదంటే రూ.5 కోట్లు ఇవ్వాలి. అలా జరగకపోతే తప్పకుండా చంపేస్తాం. మా గ్యాంగ్‌ చాలా యాక్టివ్ గా ఉంది' అంటూ మెసేజ్ పంపినట్లు చెప్పారు. అయితే దీనిపై వెంటనే దర్యాప్తు చేపట్టినట్లు తెలిపిన పోలీసులు.. అక్టోబరు 30న కూడా సల్మాన్‌ఖాన్‌ను బెదిరిస్తూ రూ. 2 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలిపారు. 

ఇది కూడా చదవండి: Imane Khelif: ఆమె కాదు అతడే.. స్వర్ణ పతకం వెనక్కి తీసుకోండి: హర్భజన్‌

భద్రత మరింత పెంచిన ప్రభుత్వం.. 

ఇదిలావుంటే.. ఇటీవలే లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో శత్రుత్వాన్ని ముగించుకోవాలంటే ఆయన రూ.5 కోట్లు చెల్లించాలని, లేదంటే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే దారుణంగా చంపుతామని దుండగులు మెసేజ్‌ పంపినట్లు చెప్పారు. ఇక 2024 ఏప్రిల్‌లో సల్మాన్‌ నివాసం ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ కు భద్రతను పెంచింది.

ఇది కూడా చదవండి: US Election 2024: అమెరికా ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనాలివే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Crime story: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!

తల్లిదండ్రుల క్షణికావేశానికి పసిబిడ్డలు బలవుతున్నారు. ముఖ్యంగా అక్రమ సంబంధాల మోజులో నవమాసాలు మోసిన తల్లులే ముక్కుపచ్చలారని పిల్లలను అత్యంత దారుణంగా హతమారుస్తున్నారు. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఇలాంటి కేసులు నమోదవడం సమాజాన్ని కలవరపెడుతోంది. 

New Update
children crime

Parents killing children for illicit relations

Crime story: దేశంలో తల్లిదండ్రుల క్షణికావేశానికి బలవుతున్న పిల్లల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. విహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఒకరు.. భర్త ప్రేమను పంచట్లేదని మరొకరు.. చదువులో వెనకబడ్డారని ఇంకొకరు.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మరొకరు. ఇలా కారణాలేవైనా పేరెంట్స్ తీసుకుంటున్న నిర్ణయాలకు ముక్కుపచ్చలారని చిన్నారులు బలవుతూనే ఉన్నారు.  

ముగ్గురు పిల్లలు కానరానిలోకాలకు..

తమిళనాడు పుదుకోట్టైలో తల్లి కసాయిగా మారింది. ఐదు నెలల చిన్నారిని నీళ్ల డ్రమ్ములో ముంచి చంపేసింది. భర్త తనపై కాకుండా తమకు పుట్టిన బిడ్డతో ప్రేమగా ఉంటున్నాడని కడతేర్చింది. మరో కేసులో ఓ తల్లి ప్రియుడితో కలిసి ఉండేందుకు పిల్లలకు విషమిచ్చింది. రాత్రి భోజనంలో విషం కలిపి ముగ్గురు పిల్లలను కానరాని లోకాలకు పంపించింది. ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో జరిగింది. 

Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

కాళ్లు చేతులు కట్టేసి..

కాకినాడలో ఓ తండ్రి కన్నబిడ్డల పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. చదువులో వెనకబడ్డారని ఇద్దరు పిల్లల జీవితాలను చిదిమేశాడు. కాళ్లు చేతులను తాళ్లతో కట్టి బకెట్లో ముంచి ఊపిరి తీశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక హైదరాబాద్ హబ్సిగూడలో ఆర్థిక ఇబ్బందులతో ఫ్యామిలీ బలవన్మరణానికి పాల్పడింది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. పేరెంట్స్ ఉరేసుకుని చనిపోయారు.

Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

తప్పు వారిదైనా శిక్ష పిల్లలకే..

తల్లిదండ్రుల ఒత్తిడి, క్షణికావేశం..ఇలా కారణాలు ఏవైనా పేరెంట్స్ తీసుకునే నిర్ణయాలతో అభంశుభం తెలియని చిన్నారులు బలవుతూనే ఉన్నారు. తప్పు తల్లిదైనా.. తండ్రిదైనా శిక్ష మాత్రం పిల్లలు అనుభవిస్తున్నారు. ఎన్నోఏళ్ల జీవితాన్ని చూడాల్సిన చిన్నారులు చిన్నతనంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలు పిల్లల ప్రాణాలను తీసేలా ఉండకూదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

childrens | telugu-news | parents

Advertisment
Advertisment
Advertisment