జై భీమ్ సీన్ రిపీట్.. త్రీ టౌన్ పోలీసుల ఓవర్‌యాక్షన్ కర్నూల్ లో జై భీం మూవీ సీన్ రిపీట్ అయ్యింది. కర్నూల్ త్రీ టౌన్ పోలీసులు ఇద్దరు అనుమానితులను 14 రోజులుగా బంధించి చేయని తప్పును ఒప్పుకోమని చిత్రహింసలు పెట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితుల తల్లిదండ్రులు లాయర్‌ను ఆశ్రయించడంతో విషయం బయట పడింది. By Kusuma 01 Oct 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి కర్నూల్‌లో త్రీ టౌన్ పోలీసులు అత్యుత్సాహానికి పాల్పడ్డారు. జై భీమ్ సినిమా సీన్‌ని పోలీసులు రిపీట్ చేశారు. ఇద్దరు అనుమానితులను 14 రోజులుగా పోలీస్ స్టేషన్‌లోనే ఉంచి నరకం చూపించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. చేయని తప్పులకు ఒప్పుకోమని ఇద్దరూ పిల్లలను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని బంధువులు ఆరోపించారు. 14 రోజుల నుంచి పిల్లలు కనిపించడం లేదని చివరికి లాయర్లను తల్లిదండ్రులు ఆశ్రయించారు. ఇది కూడా చూడండి: Mlc Kavitha: ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత! రంగంలోకి దిగి.. దీంతో జడ్జి సెర్చ్ వారెంట్ ఇవ్వడంతో అడ్వకేట్ జనరల్ రంగంలోకి దిగారు. అనుమానితుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి లాయర్ జడ్జి ముందు పెట్టారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. అమాయకులను చిత్రహింసలకు గురి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూల్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ మురళీధర్ రెడ్డి గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇది కూడా చూడండి: మహిళను ఈడ్చుకెళ్లి గెంటేసిన విమాన సిబ్బంది.. వైరల్ అవుతున్న వీడియో! కర్నూలు:త్రీ టౌన్ పోలీసుల అత్యుత్సాహం14 రోజులుగా పోలీస్‌స్టేషన్‌లోనే ఇద్దరు అనుమానితులుజై భీమ్ సినిమా తరహాలో పోలీసుల దాష్టీకం.చేయని తప్పులను ఒప్పించేలా తమ పిల్లలను చిత్రహింసలు గురిచేశారని ఆరోపిస్తున్న బంధువులుఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..#Kurnool #LatestNews #Viralnews… pic.twitter.com/lvxVFsmK3j — RTV (@RTVnewsnetwork) October 1, 2024 #kurnool #police-station #jai-bhim మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి