గంజాయిని ఎలా తరలిస్తున్నారో.. మీరే చూడండి

పుష్ప సినిమా తరహాలో ట్యాంకర్‌లో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న వారిని పోలీసులు కొమురం భీం చెక్ పోస్ట్ దగ్గర పట్టుకున్నారు. వారి నుంచి 290 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏపీ నుంచి మధ్యప్రదేశ్ రవాణా చేస్తున్నట్లు సమాచారం.

New Update
Foto (1)

పుష్ప సినిమా తరహాలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఘటన కుమురం భీం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కుమురం భీం జిల్లాలోని వాంకిడికి చెక్ పోస్ట్‌ దగ్గర అక్రమంగా గంజాయిని తరలిస్తున్న వారిని పట్టుకున్నారు. రాజమహేంద్రవరం నుంచి మధ్యప్రదేశ్‌కు వెళ్తున్న ఒక ట్యాంకర్ లారీ డ్రైవర్ అనుమానస్పదంగా కనిపించారు. దీంతో వాంకిడి చెక్‌పోస్ట్ దగ్గర వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు.

ఇది కూడా చదవండి: జగన్ కు బిగ్ షాక్.. మీటింగ్ మధ్యలోనే అలిగి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే

సినిమాల లెవల్‌లో ప్లానింగ్..

పుష్ప సినిమాలో ఎలా పాల ట్యాంకర్‌లో ఎర్రచందనం తరలించారో.. అలాగే ట్యాంకర్ మధ్యలో గంజాయి పెట్టారు. ప్రత్యేకంగా తయారు చేసిన ట్యాంకర్ మధ్యలో దాదాపుగా 290 కిలోల గంజాయిని గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ దాదాపుగా రూ.72.50 లక్షలు ఉంటుందట.

ఇది కూడా చదవండి: TG Train: తెలంగాణ రైలు ప్రయాణికులకు శుభవార్త.. మరో రెండు కొత్త లైన్లు!

 డ్రైవర్‌తో పాటు మరికొందరిని అరెస్టు చేశారు. అయితే ఈ గంజాయిని ఎక్కడ నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీని వెనుక ఉన్న ముఖ్య పాత్రదారులు ఎవరనే విషయంపై కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ కాస్త ఆందోళనగా ఉండటం గమనించి పోలీసులు గంజాయి ఉన్నట్లు గుర్తించారట. అయితే దీని వెనుక ఎవరున్నారనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికలకు ముందే అణుబాంబు దాడి.. ఇరాన్‌ బిగ్ ప్లాన్!

ప్రస్తుతం గంజాయి ముఠాలు పెరుగుతున్నారు. పోలీసులు కళ్లు కప్పి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రాల సరిహద్దుల్లో ఎక్కువగా ఈ ఘటనలు కనిపిస్తున్నాయి. పోలీసులకు అనుమానం రాకుండా ఇలా ట్యాంకర్లలో పెట్టి తరలిస్తున్నారు. ఇలాంటి ఘటనలతో పోలీసులు కూడా అప్రమత్తమవుతున్నారు. 

ఇది కూడా చదవండి: ప్రెసిడెంట్ అయ్యేనాటికి యుద్ధం ముగియాలి–ఇజ్రాయెల్‌కు చెప్పిన ట్రంప్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana: విషాదం.. ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి.. !

హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో మంగళవారం ఆయసంతో ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తికి వైద్యులు ఎక్స్పైరీ అయిన ఇంజక్షన్‌ను ఇచ్చారు. అది వికటించడంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతదేహాంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

New Update
Injuction

Expired Injuction

హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇంజక్షన్ వికటించడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇంతకీ అసలేం జరిగిందో తేలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. కార్వాన్ బాంజవాడికి చెందిన ఐలయ్య(53) మంగళవారం మధ్యాహ్నం ఆయాసంతో బాధపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని రింగ్‌రోడ్డు సమీపంలో హైకేర్‌ ఆస్పత్రికి తరలించారు. 

Also Read: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!

ఆ తర్వాత వైద్యులు అతడికి పరీక్షలు చేసి ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతడి ఆరోగ్యం క్షీణించింది. దీంతో అక్కడున్న వైద్యులు తమ ఆస్పత్రిలో గుండె సంబంధిత వైద్యులు లేరని.. వెంటనే మరో ఆస్పత్రికి తరలించాలని సూచనలు చేశారు. అయితే కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా.. అప్పటికే ఐలయ్య మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు ఇలా ఎలా జరిగిందని వైద్యులను నిలదీశారు. 

Also Read: పశ్చిమ బెంగాల్‌లో హింస వెనుక ముఖ్యమంత్రి కుట్ర : కేంద్ర మంత్రి

చివరికి ఐలయ్యకు ఇచ్చిన ఇంజక్షన్లను పరిశీలించారు. అయితే ఆ ఇంజక్షన్ మార్చి నెలలోనే ఎక్స్పైరీ అయినట్లుగా గుర్తించారు. గడువు ముగిసినప్పటికీ కూడా ఇంజక్షన్ ఇవ్వడం ఏంటని వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇంజక్షన్ ఇవ్వడం వల్లే ఐలయ్య మృతి చెందాడని వాగ్వాదానికి దిగారు. దీంతో మృతదేహంతోనే ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుని విచారణ చేస్తున్నారు. ఇదిలాఉండగా.. గతంలో కూడా ఇలా ఇంజక్షన్‌లు వికటించి రోగులు మృతి చెందిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 

Also Read: సూర్యాపేట జిల్లాలో కూలీల ఆటో బోల్తా.. స్పాట్‌లో పదిమంది!

rtv-news | telangana 

Advertisment
Advertisment
Advertisment