/rtv/media/media_files/2025/04/05/JsayVG120tC7ZVLLPuZZ.jpg)
Karnataka-gang-rape
కర్ణాటకలో మరో నిర్భయ లాంటి ఘటన చోటుచేసుకుంది. దావణగెరె జిల్లాలో కదులుతున్న బస్సులో ఓ మహిళపై ముగ్గురు కామాంధులు ఇద్దరు కుమారుల ముందే సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన బాధితురాలు మార్చి 31వ తేదీన తన ఇద్దరు పిల్లలతో కలిసి దావణగెరె జిల్లాలోని హరపనహళ్లిలో ఉన్న ప్రసిద్ధ మత కేంద్రమైన ఉచ్చంగిదుర్గ ఆలయాన్ని సందర్శించుకుంది.
Also read : అజిత్ యాక్షన్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ రిలీజ్.. మాస్ లుక్‌లో అదరగొట్టేశాడుగా!
Also read : పెళ్లైన తెల్లారే జంప్.. ఇప్పటికే ముగ్గురితో మూడు ముళ్లు!
ప్రయాణీకులందరూ దిగిన తర్వాత
అనంతరం తన ఇంటికి వెళ్లడానికి చివరి బస్సు ఎక్కింది. చన్నపుర గ్రామం సమీపంలో బస్సు ముఠా డ్రైవర్, కండక్టర్ ఆమెపై అత్యాచారం చేశారు. ప్రయాణీకులందరూ దిగిన తర్వాత నిందితులు ఈ నేరానికి పాల్పడ్డారు. డ్రైవర్ బస్సును చన్నపుర సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి, పిల్లల నోటిలో గుడ్డను పెట్టి గొంతు బిగించాడని, వారి చేతులను కూడా కట్టేసి, వారి ముందే తల్లిపై సామూహిక అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు.
Also read : Pawan Kalyan: నీ అభిమానం సల్లగుండా.. పవన్ కోసం రక్తం చిందించిన అభిమాని.. ఏం చేశాడంటే?
అయితే పొలాల్లో ఉన్న రైతులు, అటుగా వెళ్తున్నవారు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ మహిళను రక్షించారు. ముగ్గురు నిందితులు - డ్రైవర్ ప్రకాష్ మడివలర, కండక్టర్ సురేష్, హెల్పర్ రాజశేఖర్ - పట్టుకుని అరసికెరె పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో ఒకరిపై గతంలో ఏడు కేసులు ఉన్నాయి. ఆశ్చర్యకరంగా స్థానిక పోలీసులు ఈ కేసును నీరుగార్చడానికి ప్రయత్నించగా... విజయనగర ఎస్పీ శ్రీహరి బాబు బిఎల్ జోక్యం చేసుకున్న తర్వాతే చర్యలు ప్రారంభించారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
Also read : చనిపోయిందని భర్త అంత్యక్రియలు..మూడేళ్ల తరువాత లవర్తో భార్య ప్రత్యక్షం!