ప్రేమ నిరాకరించిందని.. ఇంటర్ అమ్మాయిని దారుణంగా చంపిన యువకుడు!

ప్రేమను నిరాకరించిందని ఇంటర్ విద్యార్థిని నోట్లో పురుగుల మందుపోసి చంపిన ఘటన కర్నూల్ జిల్లా నగరూర్ గ్రామంలో చోటుచేసుకుంది. అశ్విని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డ సన్నీ పారిపోగా పోలీసులు గాలిస్తున్నారు.  

New Update
ser se

AP Crime: ఏపీలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనతో చదువుకుంటూ స్నేహంగా ఉంటున్న అమ్మాయి తన ప్రేమ నిరాకరించిందని దారుణానికి పాల్పడ్డాడు. తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదనే కక్షతో అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘోరమైన సంఘటన 
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరు గ్రామంలో చోటు చేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: సైబర్ స్కామ్.. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో మహిళ బట్టలు విప్పించి..!

కర్నూల్ జిల్లా కేంద్రలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అశ్విని అనే అమ్మాయిని సన్నీ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించాలని వేధిస్తున్నాడు. కానీ సన్నీ ప్రేమను అశ్విని నిరాకరిస్తోంది. తనకు ఇష్టం లేదని, ఇలాంటి పనుల వల్ల చదువు డిస్ట్రబ్ అవుతుందని నచ్చజేప్పేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ సన్నీ తన ప్రవర్తను మార్చుకోకపోగా.. మరింతగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో అశ్విని గట్టిగా మందలించింది. ఈ క్రమంలోనే అశ్వినిపై పగ పెంచుకున్న సన్నీ.. అశ్విని ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరబడి దారుణం చేశాడు. 

ఇది కూడా చదవండి: TN: హిందీని రుద్దకండి..మళ్ళీ రాజుకున్న వివాదం..మోదీకి స్టాలిన్ లేఖ

ఒంటరిగా ఉన్న అశ్విని నోట్లో బలవంతంగా పురుగు మందు పోసి పారిపోయాడు. అయితే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అశ్వినిని గుర్తించిన బంధువులు ఆస్పత్రికి తరలించేలోపే అశ్విని మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. పరారిలో ఉన్న సన్నీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: సిన్వర్‌ చనిపోయే ముందు డ్రోన్ ఫొటేజ్.. వైరల్ అవుతున్న వీడియో

ఇది కూడా చదవండి: వివాదంలో ఇరక్కున్న సీఎం కుమారుడు.. ఏం చేశాడంటే ?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు.

author-image
By Krishna
New Update

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  అనూష అనే నిండు గర్భిణి తన భర్త జ్ఞానేశ్వర్‌ చేతిలో దారుణ హత్యకు గురి కాగా..  కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు. అక్కడికి చేరుకున్న అనూష బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రత్యక్షంగా భార్యను, పరోక్షంగా తల్లి కడుపులో బిడ్డను హత్య చేసిన నిందితుడు  జ్ఞానేశ్వర్‌ ను కఠినంగా శిక్షించాలని అనూష కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.  ఇలాంటి వాడిని ఉరిశిక్ష సరైనదని కోరుతున్నారు. కాగా నిందితుడు జ్ఞానేశ్వర్‌ను పీఎం పాలెం పోలీసులు భీమిలి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు.

Also read :   రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

ప్రేమించి పెళ్లి చేసుకుని 

గెద్దాడ జ్ఞానేశ్వర్, అనూష (27) 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మధురవాడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటున్నారు.  రెండు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు నడుపుతోన్న జ్ఞానేశ్వర్ తన భార్యకు అతని కుటుంబ సభ్యులను మాత్రం పరిచయం చేయలేదు.  అత్తమామల వద్దకు వెళ్దామని ఆమె ఎప్పుడు అడిగినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు.  ఓసారి తనకు క్యాన్సర్ ఉందని చెప్పి విడాకులు తీసుకుందామని నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటూ భార్యను మోసం చేయాలని అనుకున్నాడు. కానీ ఆమె నీతోనే జీవితమని తెగేసి చెప్పింది. దీంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని...   నిద్రలో ఉన్న భార్యను పీక నులిమి హత్య చేశాడు. ఆ తరువాత ఏమీ ఎరగనట్లు స్థానికులతో కలిసి కేజీహెచ్‌కు తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన పోలీసులు జ్ఞానేశ్వర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజం ఒప్పుకున్నాడు.  

Also read : ఇంకొద్ది రోజులకైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో సంచలనం!

Advertisment
Advertisment
Advertisment