ED: అక్రమంగా దోచుకున్న డబ్బు.. మొదటిసారి రౌడీ షీటర్ ఆస్తులు జప్తు అక్రమంగా దోచుకున్న రౌడీ షీటర్ డబ్బును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. ఎలాంటి ఆదాయం లేకపోయిన ప్రజలను బెదిరించి సంపాదించిన మహ్మద్ కైసర్ అలియాస్ పహిల్వాన్ కైసర్ ఆస్తులను ఈడీ మొదటిసారిగా జప్తు చేసింది. By Kusuma 19 Oct 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి నేరాలకు పాల్పడుతూ.. అక్రమంగా దోచుకున్న రౌడీ షీటర్ డబ్బును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. మొదటిసారి ఈ విభాగంలో ఒక రౌడీ షీటర్ ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహ్మద్ కైసర్ అలియాస్ పహిల్వాన్ కైసర్‌గా మారిన రౌడీ షీటర్‌పై గతంలో ఎన్నో కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఎలాంటి ఆదాయం లేకపోయిన ప్రజలను బెదిరించి వారి నుంచి డబ్బు దోచుకున్నాడని ఈడీ గుర్తించింది. ఇది కూడా చూడండి: పోలీసులు ఆకస్మిక దాడులు.. పబ్‌లో యువతులతో అసభ్యకరమైన డ్యాన్సులు అక్రమంగా సంపాదించి.. ఈ రౌడీ షీటర్ వీటితో పాటు హత్యలు, హత్యాయత్నాలు, జూదం, భూ కబ్జాలకు కూడా పాల్పడినట్లు కూడా అభియోగాలు ఉన్నాయి. గతంలో ఓసారి అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఎన్నో నేరాలు చేసి తన భార్య పేరు మీద కోట్ల ఆస్తులను ఉంచాడు. ఇవన్నీ కేవలం నగదు రూపంలోనే చెల్లింపులు చేశాడని ఈడీ తెలిపింది. పెద్ద ఎత్తునే స్థిరాస్తులు కూడబెట్టాడని, దాదాపుగా వీటి విలువ రూ.1.01 కోట్లు ఉంటుందని తెలిపింది. అయితే అనధికారికంగా భూమి విలువ ఇంకా ఎక్కువ కోట్లు ఉంటుందని ఈడీ వెల్లడించింది. ఇది కూడా చూడండి: TG Group-1: గ్రూప్-1 వివాదం.. అసలు జీవో 55, జీవో 29 ఏంటి? ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ పబ్‌లో పోలీసులు అకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్ నెంబర్ 4లో ఉన్న ఓ పబ్‌లో యువతులతో అసభ్యకరమైన నృత్యాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పబ్‌కి వెళ్లిన పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మొత్తం 142 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 100 మంది యువకులు ఉండగా. 42 మంది పురుషులు ఉన్నట్లు తెలిపారు. ఇది కూడా చూడండి: సల్మాన్ ఖాన్‌ను దారుణంగా చంపుతాం.. పోలీసులకు బిష్ణోయి గ్యాంగ్ మెసేజ్ కస్టమర్లను ఆకర్షించేందుకు పబ్ నిర్వాహకులు 42 మంది యువతులతో అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నారని పోలీసుల దాడిలో తేలింది. పోలీసులు దాడి చేసే సమయానికి అక్కడ మొత్తం 100 మంది యువకులు ఉన్నారు. వెంటనే వీరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చూడండి: TN: గవర్నర్‌ను రీకాల్ చేయండి...కేంద్రానికి స్టాలిన్ డిమాండ్ #enforcement-directorate మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి