హైదరాబాద్‌లోని మధురానగర్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఏసీపీ అధికారిని పోలీసులు పట్టుకున్నారు. సిద్ధిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు ఆపారు. అయితే ఏసీపీ బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌కు సహకరించలేదు. దీంతో పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులకు తెలిపి.. వెంటనే పోలీసులు ఆ ఏసీపీని అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చూడండి: ఉత్కంఠంగా సాగిన మూడో టీ20..భారత్ విజయం
#Telangana: Siddipet Traffic ACP Suman Kumar and businessman Jaipal Reddy were arrested by Madhura Nagar police after an alleged drunk driving incident and subsequent altercation with Sanjeeva Reddy Nagar traffic police. The ACP reportedly obstructed officers from conducting a… pic.twitter.com/9x8bOa8VFZ
— @Coreena Enet Suares (@CoreenaSuares2) November 13, 2024
ఏసీపీ తాగి వాహనం నడిపితే..
సాధారణంగా ఎవరైనా మద్యం తాగి వాహనం నడిపితే వారిని పోలీసులు అరెస్టు చేస్తారు. కానీ పోలీసులే మద్యం తాగి వాహనం నడిపితే ఇంకా సాధారణ మనుషులేం వింటారు. ఒక ఉన్నత పదవిలో ఉండి మద్యం సేవించి వాహనం నడిపితే తప్పకుండా కఠిన శిక్షల ఉంటాయని హైదరాబాద్ పోలీసులు నిరూపించారు.
ఇది కూడా చూడండి: ఈరోజే మనకు బాలల దినోత్సవం..ఏఏ దేశాల్లో ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా?
ఇదిలా ఉండగా.. ఇటీవల ఏపీ ముదినేపల్లి పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. మంగళవారం రాత్రి ఊటుకూరుకు చెందిన సురేశ్ ఒంటిపై బ్లేడు గాట్లతో రక్త సిక్తమై కనపించగా జనాలను భయబ్రాంతులకు గురి చేశాడు. ఎవరైనా తన దగ్గరకు వస్తే పీక మొత్తం కోసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు సైతం అడ్డుకునే సాహసం చేయకపోగా ఘనటకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చూడండి: Booker Prize: బుకర్‌ప్రైజ్ విజేతగా మొదటిసారి ఓ మహిళ
ఈ మేరకు రక్తం కారుతుండగానే అర్ధనగ్నంగా కనిపించిన సురేష్.. వారం రోజుల క్రితం తనను కానిస్టేబుల్ కొట్టిన సంఘటనపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయాడు. కేసు అడగటానికి వస్తే ఏఎస్ఐ పీక కోసేశాడని, అందుకే మిగిలినది తాను కోసుకుంటున్నానని అన్నాడు. అయితే ఎట్టకేలకు మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్, స్థానికులు కొంత మంది కలిసి చికిత్స నిమిత్తం సురేష్ ను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చూడండి: కంగువ ట్విట్టర్ రివ్యూ.. సూర్య బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టినట్లేనా!