వైద్యుల నిర్లక్ష్యం.. ప్రైవేట్ ఆసుపత్రికి రూ.30 లక్షల జరిమానా!

వైద్యుల నిర్లక్షం వల్ల భువనగిరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి గుంటూరు వినియోగదారుల ఫోరం రూ. 30 లక్షల జరిమానా విధించింది. ఓ వ్యక్తికి కడుపులో ఇన్ఫెక్షన్ సోకగా.. రాళ్లు ఉన్నాయని ఆపరేషన్ చేశారు. కానీ తర్వాత అతను మరణించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

New Update
Hospitals: వైద్య సిబ్బందిపై దాడులు.. కేంద్రం కీలక ఆదేశాలు

వైద్యుల నిర్లక్ష్యం వల్ల భువనగిరిలోని ఓ ఆసుపత్రికి గుంటూరు వినియోగదారుల ఫోరం రూ.30 లక్షల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు ఆర్టీసీ కాలనీలోని గాంధీ నగర్‌లో షేక్ జానీ నివసిస్తున్నాడు. ఇతను కారు సీట్లు మరమ్మత్తులు చేస్తుంటాడు. అయితే గుంటూరులో పెద్దగా పనులు లేకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి ప్రాంతానికి వెళ్లి అక్కడ పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే 2022 నవంబర్‌లో తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు.

ఇది కూడా చూడండి:  Sabarimala: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా 26 రైళ్లు ఏర్పాటు

కడుపులో రాళ్లు ఉన్నాయని..

ఓ రోజు తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో భువనగిరిలోని నిర్మలా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్లాడు. వైద్యులు అతనికి స్కానింగ్ చేయించాలని రాయల్ డయాగ్నోస్టిక్స్ సెంటర్‌కు పంపారు. తన కడుపులో రాళ్లు ఉన్నాయని, అందుకే తీవ్రంగా కడుపు నొప్పి వస్తుందని ఆ రిపోర్ట్ ఆధారంగా వైద్యులు గుర్తించారు. దీంతో వెంటనే ఆపరేషన్ చేయాలని అతనికి సూచించారు. ఆపరేషన్ చేస్తే 24 గంటల కడుపు నొప్పితో పాటు గాల్ బ్లాడర్‌ను కూడా తొలగించవచ్చని రెండింటికి ఒకేసారి ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. కానీ ఆ తర్వాత మళ్లీ అతనికి కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లగా.. చికిత్స అందించారు. 

ఇది కూడా చూడండి:  పొగమంచు ఎఫెక్ట్.. ఢిల్లీలో పనివేళల్లో మార్పులు

అక్కడికి కొన్ని రోజుల తర్వాత మళ్లీ అతనికి తీవ్రంగా కడుపు నొప్పి వచ్చింది. దీంతో ఆ ఆసుపత్రికి వెళ్లకుండా వేరే దగ్గరికి వెళ్లగా.. ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు చెప్పారు. వెంటనే హైదరాబాద్ వెళ్లి మెరుగైన చికిత్స తీసుకోవాలని సూచించారు. అయితే ఆర్థికంగా ఇబ్బందులు ఉండటంతో జానీని కుటుంబ సభ్యులు అదే నెలలో గుంటూరులోని జీజీహెచ్‌లో జాయిన్ చేశారు. అక్కడ చికిత్స తీసుకుంటూనే ఈ ఏడాది జనవరిలో జానీ చనిపోయాడు. దీంతో నిర్మలా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే జానీ చనిపోయాడంటూ అతని కుటుంబ సభ్యులు లాయర్ ద్వారా నోటీసులు పంపిచారు.

ఇది కూడా చూడండి:  ట్రంప్ మరో విచిత్ర నిర్ణయం.. వ్యాక్సిన్లు వద్దన్న వ్యక్తికి హెల్త్ మినిస్ట్రీ!

అయినప్పటికీ ఆసుపత్రి వైద్యులు స్పందించలేదు. దీంతో వారు గుంటూరులోని వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు. వాదనల అనంతరం కమీషన్ వైద్య ఖర్చుల కింద రూ.30 వేలు, నష్టపరిహారంగా రూ.30 లక్షలు, మానసిక ఒత్తిడికి గురిచేసినందుకు మరో రూ. పదివేలు కలిపి బాధిత కుటుంబానికి అందించాలని తీర్పు చెప్పింది. ఈ మొత్తాన్ని 6 వారాల్లోగా చెల్లించాలని కూడా స్పష్టం చేసింది. 

ఇది కూడా చూడండి: ఉన్నత హోదా ఇప్పిస్తామని.. హీరోయిన్ తండ్రికి రూ.25 లక్షలు టోకరా

Advertisment
Advertisment
తాజా కథనాలు