/rtv/media/media_files/2025/04/06/WMqkrgCCjTEpqYA2OI2o.jpg)
kajal husbend sucide Photograph: (kajal husbend sucide)
అతుల్ సుభాష్ ఆత్మహత్య ఇండియాలోనే సంచలనంగా మారింది. సరిగ్గా అలాంటి విషాదమే మరోకటి చోటుచేసుకుంది. భార్య వేధింపులు భరించలేక భర్త సెల్ఫీ వీడియో తీసికొని సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగింది. లవ్ మ్యారేజ్ చేసుకున్న ఓ యువకుడు భార్య కాజల్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకు ముందు ఫేస్‌బుక్‌లో లైవ్ వీడియో పెట్టి తన భార్య మరియు ఆమె కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశాడు. ఈ కేసులో, మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేశారు.
Also read: Pamban Bridge: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం
#WATCH | Bhopal, Madhya Pradesh | On young man allegedly harassed case, ACP Nihit Upadhyay says, "The case was registered in Ashoka Garden wherein a man committed suicide after making a video of himself alleging his in-laws... We have started the investigation after registering… pic.twitter.com/rq89CSNDNi
— ANI (@ANI) April 5, 2025
Also Read: ఫస్ట్ నైట్‌లో వధువు వింత కండీషన్.. గజగజ వణికిపోయిన వరుడు!
భోపాల్‌లోని అశోక గార్డెన్ ప్రాంతంలో అభిషేక్ బచాలే(25) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు, ఆ యువకుడు తన భార్య, అత్తమామలు అతన్ని హింసించారని ఆరోపించాడు. అతను ఫేస్‌బుక్ లైవ్‌లో తన ఆవేదనను వెల్లబోసుకున్నాడు. అభిషేక్ ఇలా సూసైడ్ చేసుకుంటున్నందుకు అతని కుటుంబానికి క్షమాపణలు కూడా చెప్పాడు. అతను కొన్ని నెలల క్రితం కాజల్‌తో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఫేస్‌బుక్ లైవ్ వీడియోలో అభిషేక్ మాట్లాడుతూ.. “నా జీవితం నాశనం అయింది.” నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తోంది. నాన్న దయచేసి నన్ను క్షమించండి. నేను శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. నా చావుకు నా భార్య కాజల్, ఆమె తల్లిదండ్రులు, తోబుట్టువులే కారణం. కొంతకాలం క్రితం అతని భార్య అభిషేక్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టిందని అశోక గార్డెన్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ హేమంత్ శ్రీవాస్తవ ఆజ్ తక్‌తో అన్నారు. ప్రస్తుతం మృతుడి కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలాలు తీసుకొని కేసు దర్యాప్తు ప్రారంభించబడింది.