Karimnagar : ఎంతకు తెగించార్రా.. దంపతులపై దాడి చేసి.. 70 తులాల బంగారంతో..

కరీంనగర్‌ జిల్లాలో దారుణం జరిగింది. దంపతులపై దాడి చేసి.. 70 తులాల బంగారం చోరీ చేశారు దొంగలు. ఈ ఘటన హుజూరాబాద్‌లోని ప్రతాపవాడలో చోటుచేసుకుంది. అయితే ఇది బాగా తెలిసిన వ్యక్తుల పనే అయింటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.  

New Update
huzurabad

కరీంనగర్‌ జిల్లాలో దారుణం జరిగింది. దంపతులపై దాడి చేసి.. 70 తులాల బంగారం చోరీ చేశారు దొంగలు. ఈ ఘటన హుజూరాబాద్‌లోని ప్రతాపవాడలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతాప రాఘవరెడ్డి ఇంట్లోకి ఆదివారం అర్థరాత్రి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారు. ఇంట్లో నిద్రిస్తున్న దంపతులను బంగారం, డబ్బు ఇవ్వకుంటే పొడిచి చంపేస్తామని బెదిరింపులకు దిగారు. అడ్డుకున్న రాఘవరెడ్డి భార్య, కూతురిపై దాడికి దిగారు. 

 70 తులాల బంగారంతో

అనంతరం  ఇంట్లో ఉన్న  దాదాపు 70 తులాల బంగారంతో పాటుగా రూ.8 లక్షల డబ్బును దోచుకెళ్లారు. గాయపడిన రాఘవరెడ్డి బార్యను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రాఘవరెడ్డి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు. రాఘవరెడ్డి కూతురు ఇటీవలే అమెరికా నుంచి వచ్చింది.  అయితే ఇది బాగా తెలిసిన వ్యక్తుల పనే అయింటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.  సీసీటీవీ ఫుటేజ్ అధారంగా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.  

Also Read :  పాకిస్థాన్లో హై అలెర్ట్ :  ఛాంపియన్స్ ట్రోఫీ ఎఫెక్ట్.. రంగంలోకి ఉగ్రవాదులు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు