Gujarat: భర్తను హతమార్చిన భార్య.. పెళ్లయిన నాలుగు రోజులకే..

పెళ్లయిన నాలుగు రోజులకే భర్తను భార్య హతమార్చిన దారుణ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. ఇష్టం లేకుండా తల్లిదండ్రులు పెళ్లి చేయడంతో.. తన ప్రియుడితో కలిసి ఈ కుట్ర పన్నింది. భార్య మీద అనుమానం వచ్చి పోలీసులు విచారించగా హత్య చేసినట్లు ఆ భార్య ఒప్పుకుంది.

New Update
crime..

ఇటీవల రోజుల్లో భర్త బాధితుల కంటే భార్య బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ఇతరుల మోజులో పడి కొందరు భార్యలు సొంత భర్త ప్రాణాలు తీస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలంటి ఘటనలు రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం.. పెళ్లయి ఎన్ని రోజులు కాకుండానే భర్తను హతమార్చడం ఈ తరం ఫ్యాషన్ అయిపోయింది. అయితే తాజాగా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కూడా ఇలాంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. 

ఇది కూడా చూడండి:  పవన్, పుష్ప భేటీకి డేట్ ఫిక్స్.. మెగా వివాదానికి ఫుల్ స్టాప్!

ప్రేమికుడితో కలిసి..

పాయల్ అనే మహిళకు భావిక్ అనే వ్యక్తితో ఇటీవల పెళ్లయింది. పాయల్‌కు ఇది వరకే ప్రేమికుడు ఉన్నాడు. పెళ్లికి ముందు వారి ప్రేమ విషయం ఇంట్లో చెబితే.. పెద్దలు అంగీకరించలేదు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న పాయల్ తన ప్రేమికుడితో కలిసి పెద్ద కుట్ర పన్నింది. పెళ్లయిన నాలుగు రోజులు కాకుండానే తన భర్తను హతమార్చాలని ఇద్దరూ ప్లాన్ చేసుకున్నారు. 

ఇది కూడా చూడండి:  తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత

ఈ క్రమంలో తనని పికప్ చేసుకోమని పాయల్ భావిక్‌కి చెప్పింది. దీంతో భావిక్ తనని తీసుకురావడానికి వెళ్తుండగా.. కల్పేష్ తన కొంత మందితో కలిసి అతన్ని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత భావిక్ గొంతు కోసేసి.. నర్మదా కాలువలో పడేశారు. ఇంటికి వస్తానని చెప్పిన భావిక్ రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.

ఇది కూడా చూడండి: భూమి లేని నిరుపేదలకు గుడ్ న్యూస్.. ఏటా రూ.12 వేలు

భార్య పాయల్‌పై అనుమానం రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. చివరికి పాయల్ తన ప్రేమికుడు కల్పేష్‌తో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు వీరిద్దరితో పాటు వారికి సాయం చేసిన సహచరులను కూడా అరెస్టు చేశారు. పెళ్లయిన నాలుగు రోజులకే ఇలా కొడుకు మరణించడంతో భావిక్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. 

ఇది కూడా చూడండి:  'బిగ్ బాస్ సీజన్ 8' టైటిల్ విన్నర్ గా నిఖిల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment