గుజరాత్‌లో దారుణం.. ఊపిరాడక కారులో నలుగురు చిన్నారులు

గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలోని దంపతులు వ్యవసాయ పనుల కోసం ఇంట్లోనే ఏడుగురు పిల్లలను వదిలేసి వెళ్లారు. ఇంటి దగ్గరే ఉన్న కారులో ఆడుకుని ఊపిరాడక నలుగురు పిల్లలు ఊపిరాడక చనిపోయారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు కారులో విగతజీవులుగా కనిపించారు.

New Update
sujathnagar apartment

కారులో ఆడుకుంటూ ఊపిరాడక నలుగురు చిన్నారులు చనిపోయిన విషాద ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలోని రంధియాలో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ గ్రామానికి చెందిన ఓ దంపతులు వ్యవసాయ పనుల కోసం ఏడుగురు పిల్లలను ఇంట్లోనే ఉంచి వెళ్లారు. పిల్లలు ఇంటి దగ్గర ఆడుకున్నారు.

ఇది కూడా చూడండి: ఎండతో నడిచే కారు.. ఒకసారి ఛార్జింగ్‌తో 1600KM..

కారులో ఆడుకుంటూ..

ఆ ఇంటి దగ్గర ఓ కారు ఉండగా అందులో చిన్నారులు ఆడుకోగా.. నలుగురు చిన్నారులు ఊపిరాడక చనిపోయారు. తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు కనిపించడం లేదని వెతికారు. చివరికి కారులో చూడగా చనిపోయి ఉన్నారు. పిల్లలు మరణించడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. 

ఇది కూడా చూడండి:  Jio IPO: త్వరలో రాబోతున్న జియో ఐపీఓ.. ఎప్పుడంటే?

ఇదిలా ఉండగా.. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో కూడా ఇలాంటి విషాధ ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లాకి చెందిన ఆలకుంట చందు, సరోజ దంపతులు హయత్‌నగర్‌లో ఉంటున్నారు. వీరికి ఏకైక సంతానమైన ఏడేళ్ల అజయ్ అనే కుమారుడు ఉన్నాడు. బతుకు తెరువు కోసం హయత్‌నగర్‌లోని ముదిరాజ్ కాలనీలో ఉంటున్నారు. 

ఇది కూడా చూడండి: నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. సర్వేలు ఏం చెబుతున్నాయంటే?

సాయంత్రం 3:45 గంటలకు స్కూల్ కూడా పూర్తయ్యింది. అలా ఇంటికి వెళ్లడానికి బయటకు వస్తుండగా.. స్కూల్ గేట్ దగ్గర పిల్లలు ఆడుకోవడం చూశాడు. దీంతో ఇంటికి వెళ్లడానికి వ్యాన్ ఎక్కకుండా ఆ గేట్ ఎక్కి ఊగాడు. ఆ బాలుడు ఎక్కినప్పుడు ఆ గేట్ ఒక్కసారిగా ఊడిపోయి అజయ్ మీద పడింది. దీంతో అజయ్‌కి ఊపిరి ఆడక వెంటనే సొమ్మసిల్లి కింద పడిపోయాడు.అజయ్‌ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది.

ఇది కూడా చూడండి:  Rangareddy District: బాలుడి ప్రాణం తీసిన స్కూల్ గేట్..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Himachal Pradesh Accident : పెళ్లింట తీవ్ర విషాదం.. కారు లోయలో పడి ఐదుగురి మృతి

పెళ్లింట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అదుపు తప్పి కారు లోయలో పడటంతో ఐదుగురి మృతి చెందారు. ఈ దుర్ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో పాండో ఆనకట్ట సమీపంలోని బఖ్లి రోడ్డుపై జరిగింది. మృతుల్లో ఎనిమిది నెలల చిన్నారి కూడా ఉన్నాడు.  

New Update
HP accident

HP accident

పెళ్లింట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అదుపు తప్పి కారు లోయలో పడటంతో ఐదుగురి మృతి చెందారు. ఈ దుర్ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో పాండో ఆనకట్ట సమీపంలోని బఖ్లి రోడ్డుపై జరిగింది. మృతుల్లో ఎనిమిది నెలల చిన్నారి కూడా ఉన్నాడు.  

తమ్ముడి వివాహం అయిపోయాక 

మృతులను చాచియోట్ తహసీల్‌లోని తరౌర్ గ్రామానికి చెందిన రమేష్ చంద్ కుమారుడు దునిచంద్ (33), తరౌర్ గ్రామానికి చెందిన దునిచంద్ భార్య కాంతా దేవి (28), వారి కుమార్తె కింజల్ (8 నెలలు), చాచియోట్ తహసీల్‌లోని నౌన్ గ్రామానికి చెందిన థాలియా రామ్ కుమారుడు దహ్లు రామ్ (52), నేపాల్ నివాసి మీనా దేవి (30)గా గుర్తించారు. దునిచాంద్ తమ్ముడి వివాహం అయిపోయిన తరువాత కారులో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.  

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, పాండో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దెబ్బతింది. ప్రస్తుతం, SDRF, CISF, పాండో అవుట్‌పోస్ట్ బృందాలు మృతదేహాలను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నాయి

Advertisment
Advertisment
Advertisment