/rtv/media/media_files/2025/03/31/XkASttppLsTn6TGkMISO.jpg)
businessman Venkateshwarlu
హైదరాబాద్‌లోని కర్మన్ ఘూట్ లో ఫైనాన్స్ వ్యాపారి వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గురయ్యాడు.వెంకటేశ్వర్లును కత్తితో నరికి చంపాడు పవన్ అనే యువకుడు. వెంటనే వెంకటేశ్వర్లును ఉస్మానియా ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడు పవన్ కోసం గాలింపులు చేపట్టారు. నిందితుడి తల్లితో వెంకటేశ్వర్లుకు అక్రమ సంబంధం ఉంది. గత 8 నెలలుగా ఓకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. దీనిపై వెంకటేశ్వర్లుతో పవన్ గత రాత్రి వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో అతన్ని కత్తితో నరికి చంపి పరారయ్యాడు.