బిడ్డను కొనడానికి ఎవరూ రాలేదని.. చివరికి ఏం చేశాడంటే?

కాకినాడ జిల్లాలో ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. ఆదాయం లేదని పుట్టిన బిడ్డను అమ్మడానికి ప్రయత్నించాడు. ఆడశిశువు పుట్టి 35 రోజులు అయినా ఎవరూ కొనడానికి రాకపోవడంతో గోడకేసి కొట్టి, పీక నొక్కి చంపేశాడు. గతంలో ఒకసారి కొడుకును కూడా అమ్మినట్లు పోలీసులు తెలిపారు.

New Update
Anantapur: అనంతపురంలో 'ఠాగూర్' మూవీ ఆస్పత్రి సీన్ రిపీట్.. బ్రతికే ఉందని 4 గంటలు చికిత్స!!

ఆడపిల్ల పుడితే ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని భావిస్తారు. కూతురితో తండ్రికి మంచి అనుబంధం కూడా ఉంటుంది. కానీ కొందరు కసాయి తండ్రులు ఆడపిల్లని లక్ష్మీదేవిలా కాకుండా.. రాక్షసిలా చూస్తుంటారు. అయితే కాకినాడలో ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. తన కన్న కూతురినే అమ్మడానికి ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళ్తే జగన్నాథపురానికి చెందిన కేత శివమణికి ఇటీవల కూతురు పుట్టింది. శివమణి ఎక్కువగా మందు, సిగరెట్ వంటి వ్యసనాలకు బానిసయ్యాడు. వచ్చిన ఆదాయం సరిపోకపోవడం వల్ల 35 రోజుల కిందట పుట్టిన ఆడపిల్లను అమ్మడానికి ప్రయత్నించాడు.

ఇది కూడా చూడండి:  అటుకుల బతుకమ్మ రోజు ఏ నైవేద్యం సమర్పించాలంటే?

గోడకేసి కొట్టి..

పుట్టి 35 రోజులు అయినా కూడా ఆ బిడ్డను కొనడానికి ఎవరూ రాలేదని, ఆ శిశువును చంపేశాడు. ఇంట్లో భార్యకు తెలియకుండా ఆడబిడ్డను గోడకు వేసి బలంగా కొట్టడంతో పాటు పీక నొక్కి చంపేసి.. చాప మీద వేసి ఏం తెలియనట్టు వెళ్లిపోయాడు. అయితే పాప ఎంత సమయానికి కదలకపోవడంతో తల్లికి అనుమానం వచ్చింది. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు బిడ్డ మరణించిందని తెలిపారు. తల్లికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీం ఆధారాలతో శివమణిని అరెస్ట్ చేసినట్లు కాకినాడ్ వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. అయితే గతంలో వీరికి అబ్బాయి పుడితే.. డబ్బులు కోసం విశాఖపట్నానికి చెందిన వారికి అమ్మేశాడని పోలీసులు వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: ఓటీటీలో దళపతి విజయ్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు