హైదరాబాద్‌లో సంచలనం.. భార్యని ఏసీబీకి పట్టించిన మాజీ భర్త

మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్యజ్యోతిని మాజీ భర్త శ్రీపాద్ ఏసీబీకి పట్టించాడు. అక్రమంగా సంపాదించిన డబ్బు రోజూ ఇంటికి తీసుకొస్తుందని, వద్దని చెప్పిన వినకపోవడంతో భర్త వీడియోలు తీసి సాక్ష్యాలతో భార్యను ఏసీబీకి పట్టించాడు.

New Update

కట్టుకున్న భర్తే.. భార్య అవినీతిని బట్టబయలు చేసిన ఘటన రంగారెడ్డిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్యజ్యోతి లంచం తీసుకుంటుందని తన భర్త శ్రీపాద్ భార్యను ఏసీబీకి పట్టించాడు. భార్య వేధింపులు భరించలేక విడాకులు ఇచ్చిన భర్త.. ఆమె అవినీతిని బయటపెట్టాడు.  భార్య లేని సమయంలో ఇంట్లో ఉన్న నోట్ల కట్టలను భర్త వీడియోలు తీశాడు. తన భార్య దివ్యజ్యోతి ప్రతి రోజు లక్షలలో లంచం తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెడుతుందని భర్త బయటపెట్టాడు.

ఇది కూడా చూడండి: ఆ డైరెక్టర్ గర్భవతిని చేశాడుః పూనమ్ కౌర్ షాకింగ్ పోస్ట్

ఎక్కడ చూసిన నోట్ల కట్టలే..

ఇంట్లో ఎక్కడెక్కడ ఆమె నోట్ల కట్టలు ఉంచుతుందో వాటిన్నింటిని వీడియోలు తీశాడు. అక్రమ సొమ్ము వద్దని ఎన్నిసార్లు భర్త చెప్పిన వినిపించుకోలేదని, విసుగు చెంది విడాకులు ఇచ్చేశానని శ్రీపాద్ తెలిపారు. ఇంట్లో మొత్తం రూ.70 లక్షల వరకు ఉంటుందని ఆమె భర్త ఆరోపించాడు. ఇలా లంచం సొమ్ము దాదాపుగా రూ.కోటి వరకు తన సోదరుడికి ఇచ్చిందని శ్రీపాద్ తెలిపారు. అక్రమంగా డబ్బులు తీసుకోవడం తప్పని చెబితే తనని తిట్టేదని తెలిపారు. భార్య ఎంతకి మారకపోవడంతో సాక్ష్యాలతో మీడియా ముందు ఆమె అవినీతిని బయటపెట్టారు. 

ఇది కూడా చూడండి: మహిళలకు గుడ్‌ న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: వేట మొదలైంది.. ఆ ఉగ్రవాది ఇల్లు నేలమట్టం చేసిన ఆర్మీ!

పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల హస్తం ఉందని అనుమానిస్తున్న విషయం తెలిసిందే. వీరిలో ఒక ఉగ్రవాది ఇల్లును ఐఈడీతో పేల్చివేసినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. దక్షిణ కశ్మీర్‌లోని త్రాల్‌కు చెందిన ఆసిఫ్ ఫౌజీ అలియాస్ ఆసిఫ్ షేక్‌ గుర్తించారు.

New Update
Asif Sheikh

Asif Sheikh

పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల హస్తం ఉందని అనుమానిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరిలో ఒక ఉగ్రవాది ఇల్లును ఐఈడీతో పేల్చివేసినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. దక్షిణ కశ్మీర్‌లోని త్రాల్‌కు చెందిన ఆసిఫ్ ఫౌజీ అలియాస్ ఆసిఫ్ షేక్‌ అనే వ్యక్తి ఇంటిని ఐఈడీతో ధ్వంసం చేసినట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?

ఇది కూడా చూడండి: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన

ఇది కూడా చూడండి: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?

ఇది కూడా చూడండి: New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!

Advertisment
Advertisment
Advertisment